విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై 03.09.2022 (శనివారం) ఉదయం 10.30 గంటల నుండి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్ డా. జి.సి. కిషోర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ భవానీపురం (హౌసింగ్ బోర్డు కాలనీ, మాళవిక విల్లా)లోని ఏపీ స్టేట్ ఉర్దూ అకాడమీ కాన్ఫరెన్స్ హాల్‌లో మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో అన్ని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారులు, యూనిట్ అధికారులతో ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇమామ్‌లు & మౌజన్‌లకు ప్రోత్సాహకాలు, పాస్టర్లకు గౌరవ వేతనం, ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం (PMJVK), వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షణతో పాటు వక్క్ భూముల సర్వే, కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్ పథకాలు, హాస్టల్స్ & రెసిడెన్షియల్ స్కూల్స్, మైనారిటీ కమ్యూనిటీల ప్రయోజనాల దృష్ట్యా విభిన్న రంగాలలో వినూత్న ప్రాజెక్టుల కోసం కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనరేట్ కార్యాలయం ఆ ప్రకటనలో పేర్కొంది.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …