-మొబైల్ యాప్ ఆవిష్కరించిన నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్
-సచివాలయ కార్యదర్శులకు మొబైల్ యాప్ ద్వారా ఫైన్స్ విధించే అధికారం
-స్వచ్చ నగరంకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో ఇక నుండి రోడ్ల మీద కాల్వల్లో వ్యర్ధాలు వేసే వారికీ స్పాట్ ఫైన్ తప్పదని, ప్రతి సచివాలయ కార్యదర్శికి ఫైన్స్ విధింపుకు ప్రత్యేక యాప్ రూపొందించామని నగర కమీషనరు కీర్తి చేకూరి ఐ.ఏ.యస్. తెలిపారు. శనివారం కమిషనరు తమ చాంబర్ లో యాప్ పోస్టర్ ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరాన్ని స్వచ్చ నగరంగా ఉంచడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, కాని కొందరు రోడ్ల మీద, కాల్వల్లో వ్యర్ధాలు వేసి పరిసరాల అపరిశుభ్రతకు కారణం అవుతున్నారన్నారు. ఇప్పటికే నగరపాలక సంస్థ ప్రజారోగ్య కార్మికులు ఇంటింటి చెత్త సేకరణ చేస్తున్నారని, సచివాలయ కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి వ్యర్ధాలు కార్మికులకే ఇవ్వాలని, రోడ్ల మీద లేదా కాల్వల్లో వేయవద్దని అవగాహన కల్గించారన్నారు. నగర శుభ్రతని దెబ్బతీసే వారి పట్ల ఇక నుండి కఠినంగా వ్యవహరిస్తామని, వారికి స్పాట్ ఫైన్ విధించడానికి ప్రత్యేకంగా మొబైల్ యాప్ ని రూపొందించామని తెలిపారు. ఈ యాప్ ని ప్రతి సచివాలయం కార్యదర్శి డౌన్ లోడ్ చేసుకోవాలని, దీని ద్వారా వాతావరణ కాలుష్యం, ఖాళీ స్థలాల్లో వ్యర్ధాలు వేయడం, భవన నిర్మాణ వ్యర్ధాలు రోడ్ల మీద వేయడం, నిషేదిత ప్లాస్టిక్ వినియోగం, అనధికార పోస్టర్స్, బ్యానర్లు కట్టే వారి నుండి కార్యదర్షులే నేరుగా స్పాట్ లో ఫైన్ విధించే అవకాశం ఉందన్నారు.
కార్యక్రమంలో సిటి ప్లానర్ మూర్తి, సిఎంఓహెచ్ డాక్టర్ విజయలక్ష్మీ, మేనేజర్ శివన్నారాయణ, తదితరులు పాల్గొన్నారు.