కళాశాల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా శిక్షణ కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించండి…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డిగ్రీ పూర్తి చేసుకుని బయటకు వచ్చే విద్యార్థులకు ఆఖరి సంవత్సరాంతంలో వారి ఒక్క పాఠ్యాంశాలకు అనుగుణంగా వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు 8 నెలల శిక్షణ మరియు శిష్యరికం కార్యక్రమానికి మండలాల వారిగా ప్రైవేట్‌ సంస్థలు, వారికి ఉన్నటివంటి అనుకూలతలు అనే అంశాలపై శనివారం కలెక్టర్‌ కార్యాలయం నుండి ప్రభుత్వ శాఖల అధికారులు, యూనివర్సిటిల రిజిస్ట్రార్లు, కళాశాల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు గూగుల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆశయాల మేరకు డిగ్రీలు పూర్తి చేసుకుని సమాజంలోకి వచ్చే ప్రతీ విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వివిధ సంస్థలలో శిక్షణ ఇప్పించి ఉద్యోగాలలో రాణించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ శాఖల పరిధిలోని ప్రైవేటు యాజమన్యాలలో కళాశాలల విద్యార్థులకు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సరైన శిక్షణ ఇప్పించేందుకు మండలాల వారిగా ప్రైవేటు సంస్థలలో అనుకూలత ప్రాంతాలు వారిగా సమాచారాన్ని సేకరించి నాలుగు రోజులలో సమర్పించాలన్నారు. పరిశ్రమల శాఖ, వ్యవసాయ శాఖ, వైద్య శాఖ, పర్యటక శాఖ, బ్యాంకులు, ఉద్యాన శాఖ, ఆహార శాఖ, పౌరసరఫరాలు, మత్స్య శాఖ వంటి ప్రభుత్వ శాఖ పరిధిలో ప్రైవేట్‌ సంస్థలలో శిక్షణ ఇప్పించాలన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎనిమిది నెలల శిక్షణ కార్యక్రమానికి ప్రణాళిక సిద్దం చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ శిక్షణ కార్యక్రమాన్ని సెప్టెంబర్‌ 14వ తేదిన లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. ఆటోనగర్‌లో ఉన్న పరిశ్రమల యూనిట్‌లలో ఎంతమందికి శిక్షణ ఇవ్వడానికి అనుకూలత ఉందో సమాచారం సేకరించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బిఎస్‌సి విద్యార్థులకు శిక్షణ ఇచ్చే విధంగా ప్రైవేట్‌ ఆసుపత్రులు ల్యాబ్‌ టెక్నిషియన్‌లు మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఉండే ఆక్వా సంస్థలలోను, పర్యాటక శాఖ ద్వారా ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్లలోను శిక్షణ ఇచ్చే విధంగా అనుకూలత సమాచారాన్ని సేకరించాలని కలెక్టర్‌ డిల్లీరావు అధికారులకు సూచించారు. గూగుల్‌ కాన్ఫరెన్స్‌లో జియం డిఐసి శ్రీనివాస్‌రావు, జడ్‌ యం ఏపిఐఐసి శ్రీనివాస్‌రావు తదితరులుపాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *