విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా టూరిజం మరియు కల్చరల్ అధికారి ఓ. హేమ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెలలో 27 జరగబోయే ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకుని 40 రకాల అవార్డులకు ధరఖాస్తులను ఆహ్వఇనిస్తున్నామన్నారు. ఉత్తమ హోటల్, ఉత్తమ డీలక్స్ హోటల్, ఉత్తమ బడ్జెట్ హోటల్, ఉత్తమ హరిత హోటల్, ఉత్తమపెళ్ళి హోటల్, ఉత్తమ సమావేశ మందిరం హోటల్, ఉత్తమ రిసార్ట్స్ హోటల్, ఉత్తమ కన్వెన్‌షన్ సెంటర్, అగ్రిటూరిజం ప్రాజెక్ట్, గ్రామీణ పర్యాటక ప్రాజెక్టు, ఎకో ఫ్రెండ్లి బస్ స్టేషన్ లోకల్ టూరిజం ప్రాజెక్ట్, ఉత్తమ ట్రావిల్ ఎజెంట్ ఉత్తమ ట్రావిల్ (బోటింగ్), ఉత్సవ సాహస యాత్రల ప్రతినిధి, బెస్ట్ టూరిజం విద్యాసంస్థ ఉత్తమ టూరిజం పరిశోధన ఉత్తమ టూరిస్ట్ గైడ్, కళలు సంస్కృతి ప్రయోషన్ అవార్డు తదితర 40 విభాగాలలో వార్షిక అవార్డులను ప్రధానంచేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను కోరడమైనది. ధరఖాస్తు చేసుకోనేవారు సెప్టెంబరు 10వ తేదిలోపు ఛీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటి 5వ అంతస్తు స్టాలిన్ కార్పొరేట్ విజయవాడ చిరునామకు నామినేషన్లు అందజేయవలెను మరిన్ని వివరాలకు ష.ష.ష aజ్‌ూశీబతీఱంఎ.స్త్రశీఙ వైబ్‌సైట్‌ను మరియు 9121144098, 9542019999 ఫోన్‌కు సంప్రదించాలని ఆయన తెలిపారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …