విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
విజయవాడ నగరంలో స్వర్గీయ దేవినేని నెహ్రూ చారిటిబుల్ ట్రస్ట్ ద్వారా ఎందరో నిరుపేదలకు జీవనోపాధి కల్పించడం తో పాటు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం నాడు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్,ఫకీరుగూడెం కి చెందినమాగంటి ఆంజనేయులు కి వైద్య ఖర్చుల నిమిత్తం దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయల నగదును దేవినేని అవినాష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గడప గడప మన ప్రభుత్వంలో భాగంగా ఈ నెల ఫకీరుగూడెం లో పర్యటించినప్పుడు స్థానిక కార్పొరేటర్ రహేన వారికీ వైద్య ఖర్చులు అవసరం ఉందని అవినాష్ దృష్టికి తీసుకురాగా వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది అని పేర్కొన్నారు. నాన్నగారు దేవినేని నెహ్రు సేవా స్పూర్తితో మా చారిటీ సంస్థ ద్వారా ఎన్నో వేల మందికి ఉపాధి, విద్య రంగాలలో అండగా నిలుస్తున్నాం అని అన్నారు .రాబోయే రోజుల్లో కూడా మా సేవా కార్యక్రమాలు ఇలాగే నిరాటంకంగా జరుపుతామని నా పూర్తి సహాయసహకారాలు ఉంటాయని అవినాష్ తెలిపారు.
Tags vijayawada
Check Also
అద్భుతమైన, డిజైన్ ఆధారిత ఉత్పత్తి శ్రేణితో AP NAREDCO ఎక్స్‌పోలో ప్రత్యేక ముద్ర వేసిన రీజెన్సీ సెరామిక్స్
-ఎక్స్‌పోలో రీజెన్సీ సిరామిక్స్ ఆవిష్కరణలను NAREDCO ప్రెసిడెంట్ జి హరిబాబు ప్రశంసించారు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సెరామిక్స్ …