Breaking News

గ్రామాల్లో జగనన్న స్వచ్చం సంకల్పం నూరు శాతం ఫలితాలు సాధించాలి…

-పౌర సేవలు విషయంలో జవాబుదారీ తనం ముఖ్యం..
-జిల్లా ఈవో పిఆర్డీ, పంచాయితీ కార్యదర్శుల సమావేశంలో .. కలెక్టరు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజా వార్త :
పారిశుధ్య సేవలు అందించి ప్రతి గ్రామాన్ని స్వచ్చగ్రామాలుగా తీర్చిదిద్దాల్సిన భాద్యత గ్రామ పంచాయితీలదేనని ఇందుకు ఈవోపిఆర్డీలు, పంచాయితీ కార్యదర్శులు వ్యక్తిగత భాద్యతలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత ఆదేశించారు.
శుక్రవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనంకళాకేంద్రంలో జగనన్న స్వచ్చ సంకల్పం, క్లాప్ మిత్ర, స్వమిత్ర, టాక్స్ కలెక్షన్, స్పందన,ఎస్ డబ్ల్యూ పీసీ నిర్వహణ వంటి అశాలపై మండల పంచాయితీ అధికారులు, కార్యదర్శులతో జిల్లా కలెక్టరు డీపీవో పి. జగదాంబతో కలసి జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టరు డా. కే. మాధవీలత మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని చెత్త రహిత గ్రామంగా తీర్చిదిద్దాలన్నారు. ఇందులో భాగంగా ప్రతి రోజు ఇంటింటి నుంచి చెత్త సేకరణ చేసి ఆయా ఎస్ డబ్ల్యూ పీసీ కేంద్రాలకు తరలించాలన్నారు. చెత్త నుంచి సంపదతయారీ కేంద్రాల్లో వర్మికంపోస్టు తయారుచేయు విదానం తప్పని సరిగా చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని ఎస్ డబ్య్లూ పీసీ షెడ్స్ పనిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ పంచాయితీల పనితీరు పై ప్రతి 15 రోజులకు ఒక సారి సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇంకా 39 ఎస్ డబ్ల్యూ పీసీ షెడ్స్ అవసరం ఉన్నందున వాటికి అప్రోట్ రోడ్డు, విద్యుత్ కనెక్షన్ తో ప్రతిపాదన సిద్దం చేయాలని కలెక్టరు ఆదేశించారు. ఆయా కేంద్రాల విద్యుత్, నీటి వ్యవస్థను సంబందిత పంచాయితీ నిధుల ద్వారా నిర్వహించాల్సి ఉందన్నారు. పంచాయితీల ఆర్థిక బలోపేతానికి సంపద సృష్టి కేంద్రాల పాత్ర కీలకమన్నారు. గ్రామాల్లోని ప్రతి షాపుల పరిసర ప్రాంతాల్లో శుభ్రత పాటించే విధంగా సూచనలు జారీ చేయాలన్నారు. స్పందన పిర్యాదులు, కోర్టు కేసులు, పౌరసేవలు అందించడంలోను నిబద్దతో పనిచేయాలని ప్రతి వారం ఈవో పిఆర్ అండ్ ఆర్డీ 5 సంపద సృష్టి కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించి ఆవివరాలను వెబ్ సైట్ లో అప్ లోడ్ చెయ్యాలన్నారు
డీపీవో పి. జగదాంబ మాట్లాడుతూ పంచాయితీ కార్యదర్శులు, సిబ్బంది సమయపాలన ఖచ్చితంగా పాటిస్తూ వారికి నిర్థేశించిన లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. స్పందన లో ఎక్కువుగా గ్రామ పంచాయితీల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని వాటిని నిర్ణీత కాలంలోనే పరిష్కరించి ఫోటో సహా వైబ్ సైట్ లో అప్ లోడ్ చెయ్యాలన్నారు. పౌరసేవలు విషయంలో మరింత మెరుగైన సేవలు అందించేందుకు జవాబు దారీతనం తప్పని సరి అన్నారు.
ఈ కార్యక్రమంలో డీపీఓ పి. జగదాంబ, డివిజనల్ పంచాయితీ అధికారులు జె. సూర్యనారాయణ, జి. సతీష్ కుమార్, ఈవో పిఆర్ అండ్ ఆర్డీ ఆర్మస్ట్రాంగ్, జిల్లాలోని పంచాయితీ కార్యదర్సులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

6.60 కోట్లతో నిర్మించనున్న జి.టి.యస్ పనులకు శంకుస్థాపన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో శాస్తీయ పద్దతిలో వ్యర్దాల నిర్వహణకు జి.టి.యస్ (గార్బేజ్ ట్రాన్స్ఫర్ సిస్టం) …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *