-కేంద్ర మత్స్య , పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి.
-డాక్టర్ ఎల్ మురుగన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
పరిణామ చక్రం లోనే కాదు, అన్ని ప్రధాన ప్రాచీన నాగరికతల కథల్లోనూ ‘చేప’ ప్రముఖ స్థానాన్ని పొందింది. మన పురాణాలు శ్రీ మహావిష్ణువు మొదటి అవతారమైన మత్స్యావతారం గురించి చెబుతాయి. ప్రాచీన తమిళనాడులోని అందమైన సంగం సాహిత్యం మత్స్యకారుల జీవితాల గురించి వంపుతిరిగిన పడవల గురించి (అకననూరు) స్పష్టంగా వివరణలు ఉన్నాయి. సింధు లోయ తవ్వకాలు ప్రాచీన భారతదేశంలో చేపల పెంపకం సంబంధిత కార్యకలాపాల ప్రాబల్యాన్ని ప్రశంసించడానికి దారితీస్తున్నాయి. భారతదేశం దాని విస్తృతమైన తీరప్రాంతాలు నదులతో సమృద్ధిగా మత్స్య సంపదను కలిగి ఉన్నాయి. చేపలు, మత్స్యకారులు, మొదటి నుంచి, మన సంస్కృతిలో ప్రధాన స్థానాన్ని ఆక్రమించారు.
స్వాతంత్ర్యం తర్వాత భారతీయ మత్స్య సంపద సంబంధిత రాష్ట్రాల ప్రాధాన్యత వనరులపై ఆధారపడి వివిధ దశలలో అభివృద్ధి చెందినా, కేంద్రం నుంచి తక్కువ ప్రమేయం లేదా పెట్టుబడితో (స్వాతంత్ర్యం నుంచి 2014 వరకు మత్స్య రంగానికి రూ. 3682 కోట్ల కంటే తక్కువ మొత్తంగా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి) ఈ గణాంకాలను బట్టి భారతీయ మత్స్య సంపద చాలా నిర్లక్ష్యం అయ్యింది. ధైర్యవంతులైన భారతీయ మత్స్యకారులు భీమా, సేఫ్టీ కిట్, రుణ సదుపాయం, పంటకోత తర్వాత మార్కెటింగ్ ఇబ్బందులు, తక్కువ మద్దతుతో, నలిగిన పడవలపై సముద్రాల్లోకి వెళ్లడం కొనసాగించారు. 67 సంవత్సరాల పాటు, స్వాతంత్ర్యం తరువాత, కోట్లాది మంది భారతీయులకు ఆహారం, పోషకాహారం జీవనోపాధికి ముఖ్యమైన వనరుగా ఉన్న ఈ రంగం బహిరంగ సముద్రాలలో చుక్కాని లేని ఓడలా కొట్టుకుపోయింది.
ఈ రంగానికి సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి, 2014లో అప్పటి ప్రభుత్వ అవినీతి, విధాన పక్షవాతంతో విసిగిపోయిన భారత ప్రజలు ఒక నిర్ణయం తీసుకుని కేంద్రంలో నిర్ణయాత్మక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, గతిశీల నరేంద్రమోదీ దేశం-బాధ అర్థం చేసుకోగల, మత్స్య రంగపు అవసరాలు, నాడీ తెలిసిన నాయకుడు.
మొట్టమొదటగా మోదీజీ చేసిన పని ఏమిటంటే.. మళ్లీ లోకం దృష్టిని మన మత్స్య రంగంపైకి తీసుకురావడం. గత ఎనిమిదేళ్లలో నీలి విప్లవ స్కీమ్, ఫిషరీ అండ్ ఆక్వాకల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) రూపంలో రూ. 32000 కోట్ల కంటే ఎక్కువ విలువైన పెట్టుబడులను అనేక ఇతర కార్యక్రమాలతో పాటుగా విడుదల చేసింది.
ఈ చర్యలు ‘సంస్కరణ, పనితీరు రూపాంతరం’ అనే మంత్రాన్ని అనుసరించి, అడ్డంకులను తొలగించాయి రంగాన్ని కష్టాల కడలి నుంచి విడదీశాయి. దీనివల్ల భారతదేశ చేపల ఉత్పత్తిలో 2014-15 లో 102 లక్షల టన్నుల దిగుబడి, 2021-22 నాటికి 161 లక్షల టన్నులకు అద్భుతమైన వృద్ధిని సాధించింది. 2009-10 నుంచి 2013-14 వరకు 5.27% నుంచి మొదలుకుని, మోడీ ప్రభుత్వం మొదటి ఐదు సంవత్సరాలలో మత్స్య రంగం సగటు వార్షిక వృద్ధి రేటు 10% గా పెరిగింది.
తన ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చే దిశలో, ప్రధాని మోదీ మత్స్య రంగం మరింత దృష్టి సమగ్ర అభివృద్ధి కోసం మత్స్య, పశుసంవర్ధక పాడిపరిశ్రమలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. 2020లో, ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పిఎమ్‌ఎంఎస్‌వై) ద్వారా భారతీయ ఫిషరీస్‌లో అత్యధికంగా రూ. 20050 కోట్ల పెట్టుబడిని ప్రధాని ప్రకటించారు. భారతీయ మత్స్య సంపదను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు PMMSY ప్రధాన చోదక శక్తిగా నిరూపిస్తోంది. ఈ పథకం, 2024-25 నాటికి, మత్స్య ఉత్పత్తుల ఉత్పత్తి, ఉత్పాదకత ఎగుమతులను విపరీతంగా పెంచాలని సంకల్పించింది. కోత అనంతర నష్టాలను గణనీయంగా తగ్గించడానికి భారతదేశంలో చేపల వినియోగాన్ని పెంచడానికి కూడా ఇది యోచిస్తోంది.
సంస్కరణలు చొరవలు భారతీయ ఫిషరీస్‌లో ప్రధాన మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆధునీకరణను చూశాయి, ప్రత్యేకించి కొత్త ఫిషింగ్ హార్బర్‌లు/ల్యాండింగ్ సెంటర్‌లు, సాంప్రదాయ మత్స్యకారుల చేతిపనుల ఆధునికీకరణ, మోటరైజేషన్, లోతైన సముద్రానికి వెళ్లగలిగే నౌకలు, పంటచేతికి వచ్చిన తరువాత కావాల్సిన కనీస సౌకర్యాల ఏర్పాటు, కోల్డ్ చైన్‌లు, శుభ్రత నిర్వహణ వంటివి. పరిశుభ్రమైన చేపల మార్కెట్లు, ఐస్ బాక్స్ లతో కూడిన ద్విచక్ర వాహనాలు మరెన్నో అందుబాటులోకి తెచ్చారు. మత్స్యకారులకు బీమా రక్షణ, ఆర్థిక సహాయం కిసాన్ క్రెడిట్ కార్డ్ సౌకర్యం కూడా అందిస్తున్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పటిష్టంగా కొనసాగుతోంది. డిజిటల్ ఇండియా శానిటరీ ఇంపోర్ట్ పర్మిట్‌లు (SIPలు) పొందే ప్రాసెసింగ్ సమయాన్ని 45 రోజుల నుంచి కేవలం 48 గంటలకు భారీగా తగ్గించింది. ఆమోదించిన మూలాల నుంచి నిర్దిష్ట వ్యాధికారక రహిత -SPF రొయ్యల బ్రూడ్‌స్టాక్ దిగుమతికి రొయ్యల అభివృద్ధి కార్యక్రమాల- SIPల అవసరం తొలగించారు, ఇది వందలాది రొయ్యల హేచరీలకు సహాయం చేస్తుంది. ప్రభుత్వం కూడా రొయ్యల ఆక్వాకల్చర్‌కు అవసరమైన అనేక ఇన్‌పుట్‌లపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది, తద్వారా వాటి ఎగుమతులను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.
మన మత్స్యకారులు మనకు గర్వకారణం. మత్స్యకార, మహిళల సంక్షేమం సాధికారత కోసం ‘సేవ, సుశాసన్ గరీబ్ కళ్యాణ్’ నినాదంతో మోడీ ప్రభుత్వం నిరంతరం పని చేస్తోంది. ఈ రంగాన్ని ప్రస్తుత ప్రభుత్వం వైవిధ్యభరితం చేస్తుంది. ఇప్పుడు, తమిళనాడుకు చెందిన మహిళలు సముద్రపు పాచి సాగు కోసం పనిచేస్తుండగా, లక్షద్వీప్‌కు చెందిన వారు అలంకారమైన మత్స్య సంపదను అభివృద్ధి చేస్తున్నారు. మన అస్సామీ మత్స్యకారులు-పురుషులు బ్రహ్మపుత్రలో నది గడ్డిబీడును అభివృద్ధి చేయవచ్చు, అయితే ఆంధ్రా పారిశ్రామికవేత్తలు ఆక్వాకల్చర్‌లో బలమైన ఫలితాలను చూపుతారు, ఒక్కో తూరి ఎక్కువ పంటను పొందుతారు. కాశ్మీర్ లోయకు చెందిన యువ మహిళా పారిశ్రామికవేత్తలు కోల్డ్ వాటర్ ట్రౌట్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. హర్యానాలోని సెలైన్ భూములు చేపల పెంపకం కోసం ఉత్పాదకంగా ఉపయోగిస్తున్నారు, ఈ చర్యలన్నీ వ్యర్థ భూములను సంపద భూములుగా మారుస్తున్నాయి.
ఆక్వాకల్చర్‌లో కొత్త అంకుర పరిశ్రమలు ప్రతిభ, సాంకేతికత, ఆర్ధిక, వ్యవస్థాపక స్ఫూర్తిగల మత్స్యకారులను ఆకర్షిస్తున్నాయి, నిశ్శబ్ద సామాజిక విప్లవానికి నాంది పలుకుతున్నాయి. ప్రపంచ రొయ్యల ఉత్పత్తి ఎగుమతులలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపి, ఆక్వాకల్చర్ రూపంలో భారతీయ మత్స్య సంపద అద్భుతమైన ఉప-అధ్యాయం ప్రస్తుతం రచిస్తున్నారు. ఇప్పుడు భారతదేశం 2వ అతిపెద్ద ఆక్వాకల్చర్ ఉత్పత్తిదారుగా, 3వ అతిపెద్ద చేపల ఉత్పత్తిదారుగా, 4వ అతిపెద్ద చేపలు మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశంగా మారింది.
ఈ రంగ అభివృద్ధికి ఉన్న అడ్డంకులను తొలగించి, సాంకేతికత ఆధారంగా , నిజమైన లబ్ధిదారులకు సంక్షేమం అందించడం, వ్యవస్థాపక స్ఫూర్తిని ప్రోత్సహించడం మహిళా సాధికారత పొందుతూ , స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆరు దశాబ్దాలకు పైగా ఉన్న బంధనాల నుంచి ఆ సంకెళ్ల నుంచి భారతీయ మత్స్య సంపద బయటపడింది. ‘సబ్కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ సబ్‌కా ప్రయాస్’తో ఎనిమిదేళ్ల మోదీ ప్రభుత్వం భారతీయ మత్స్య సంపదకు బలమైన పునాది వేసింది. నేడు, మనం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన – PMMSY రెండవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న, భారతీయ మత్స్య పరిశ్రమ ఇప్పటికే అద్భుత దినాల వైపు తన నడకను ప్రారంభించింది. ఇక్కడ నుంచి, అది మరింత ఎక్కువ ఆదాయంతో పాటు, మన మత్స్యకార సోదర, సోదరీమణులకు సంతోషకరమైన చిరునవ్వులను తప్పక ఉత్పత్తి చేస్తుంది.