‘ పీఎం టీబీ ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృశ్య శ్రవణ విధానంలో శుక్రవారం ప్రారంభించిన ‘ప్రధాన మంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ రాజ్ భవన్ నుండి పాల్గొన్నారు. 2025 నాటికి దేశం నుండి క్షయవ్యాధి నిర్మూలన ధ్యేయంగా ‘ప్రధాన మంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్’ మిషన్‌ పనిచేయనుండగా, ఇది రోగి-కేంద్రీకృత ఆరోగ్య వ్యవస్థకు సమాజ మద్దతును అందించే దిశగా తొలి అడుగు కానుంది. టిబిని నిర్మూలించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడానికి ప్రజలందరినీ ఏకమార్గంలోకి తీసుకువచ్చే విధానాన్ని హైలైట్ చేయడం ఈ ప్రచారం లక్ష్యంగా ఉంది. రాష్ట్రపతి ‘ని-క్షయ్ మిత్ర’ని కూడా ప్రారంభించగా, చికిత్స పొందుతున్న వారికి సహాయాన్ని అందించే దాతలకు ఇది ఒక వేదిక కానుంది. దీనిలో పోషక, అదనపు రోగనిర్ధారణ, వృత్తిపరమైన మద్దతు వంటి మూడు అంశాలు ఉన్నాయి. కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. విజయవాడ రాజ్ భవన్ నుండి గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తదితరులు పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2018 మార్చిలో ఢిల్లీలో జరిగిన ‘ఎండ్ టిబి సమ్మిట్’లో 2030 నాటి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ లక్ష్యం కంటే ఐదు సంవత్సరాల ముందు, టిబిని అంతం చేయాలని పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *