జాతీయ రహదార్ల విస్తరణ ప్రాజెక్టుల పనులకు భూ సేకరణను వేగవంతం చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
జిల్లాలో జాతీయ రహదార్ల విస్తరణ ప్రాజెక్టుల పనులకు భూ సేకరణను వేగవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌ రెవన్యూ అధికారులను ఆదేశించారు. ఎన్‌హెచ్‌ 16 జాతీయ రహదారిలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణ పనులకు అవసరమైన భూ సేకరణపై శుక్రవారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో డిఆర్‌వో కె. మోహన్‌ కుమార్‌, తహాశీల్థార్లు, భూ సేకరణ అధికారులతో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌ సమావేశం నిర్వహించారు. జిల్లాలో విస్తరించనున్న జాతీయ రహదార్లలోని గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారి ప్రాజెక్టులను, విజయవాడ, గుడివాడ, భీమవరం, నరసాపురం రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి స్థల సేకరణ అంశంపై, ప్రిలిమినరీ నోటిఫికేషన్‌, గొల్లపూడి` జక్కంపూడి రైల్‌ ఓవర్‌ రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణకు చేపడుతున్న పనులను వేగవంతం చేయాలన్నారు. విజయవాడ` భద్రాచలం రోడ్డు విస్తరణకు సంబంధించి నేషనల్‌ హైవే 30కి సంబంధించి విజయవాడ రూరల్‌ మండలంలో మూడు గ్రామాలు, రెడ్డిగుడెంలో ఒక గ్రామం, జి. కొండూరు మండలంలో 11 గ్రామాలలో చేపడుతున్న భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆయా మండలాల తహాశీల్థార్లు, భూ సేకరణ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *