విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా శనివారం ఆంధ్రప్రదేశ్ పోలీసు, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద నుండి పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు “ర్యాలీ” నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డి.జి.పి. కే.రాజేంద్రనాద్ రెడ్డి ఐ,పి,ఎస్, నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్. మరియు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ అధికారులు ఆత్మహత్యలను నీవారించడానికి, ప్రజలలో చైతన్యం కల్పించడానికి విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద పోస్టర్ ను ఆవిష్కరించడంతో పాటు, విద్యార్ధినీ విధ్యార్ధులతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ప్రతిజ్ఞ అనంతరం బెంజ్ సర్కిల్ వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు, అక్కడ నుండి పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు “ర్యాలీ” నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర డి.జి.పి. కే.రాజేంద్రనాద్ రెడ్డి ఐ,పి,ఎస్ మాట్లాడుతూ… సెప్టెంబర్ 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యల నివారణ దినం జరుగుతుందని తెలియజేశారు. లక్ష మందిలో 30-35 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, మనదేశ గణాంకాల ప్రకారం లక్ష మందిలో 12-15 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ముఖ్యంగా 15 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు వారిలో ప్రతి మూడు కారణాలలో ఒక కారణం ఆత్మహత్య. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలు ఉండేవి అనుకునేవారు అలాంటిది ఇప్పుడు అన్ని వర్గాల వారిలో, ధనికుల/పేదవాళ్ల అని లేకుండా, ఫలానా వృత్తి వాళ్లు అని లేకుండా ఆత్మహత్యలకు చేసుకోవడం జరుగుతుంది. అనేక అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ఎక్కువగా 8 నుండి12తరగతి విద్యార్దులు చదువుల వల్ల డిస్టర్బ్ అవుతున్నారు. తల్లిందడ్రులు తమ పిల్లలపై చదువుల ఒత్తిడిని తగ్గించే విధంగా చేయాలనీ, ఇప్పటికే క్వాలిటి ఎడ్యుకేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా మార్పులు తేచిందని, యువతియువకులకు కౌన్సిలింగ్ ఇప్పిస్తూ ఉండాలన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇన్సల్టింగ్ బిహేవియర్ ఉండకూడదని చెబుతూనే ఉంటాను అని తెలియజేసారు.
– తల్లిదండ్రులు గొడవలు పడుతుంటే సైకియాట్రిస్టల దగ్గరకి వెళ్లాలని పిల్లలు చెప్పాలి… ఆత్మహత్యలను నీవారించడానికి, ప్రజలలో చైతన్యం కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు.
ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్ మాట్లాడుతూ… ఆత్మహత్య చేసుకునే వారిలో రెండు రకాలుగా చేసుకుంటూ ఉంటారు, కొంతమంది క్షనికావేశంతో చేసుకునే వారు ఉంటారు, మరికొంతమంది వ్యక్తిత్వంలో మార్పులను గమనిస్తే అట్టి వాళ్లను రక్షించుకునే అవకాశం ఉంటుంది. అలాగే క్షనికావేశంతో ఆత్మహత్యకు పాల్పడే వారిని ఆపగలిగితే తర్వాత వారే అనవసరంగా ఇలా చేశాను అని బాధ పడతారు. డిప్రెషన్, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వారిని గుర్తిస్తే, కౌన్సిలింగ్ ద్వారా లేదా డిప్రెషన్ మెడిసిన్స్ తో నయం చేసి రక్షించుకునే అవకాశం ఉంది. అన్ని ఆత్మహత్యలను ఆపలేకపోయినా, ఎన్నో కొన్ని ఆపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరూ వారి వారి సమస్యల నుండి మానసికంగా, శారీరకంగా ధైర్యం తెచ్చుకొని సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలి, ఏ విధంగా సమస్యను పరిష్కరించుకోవాలి అని దృష్టిపెట్టి జీవితాన్ని కొనసాగించాలని సూచించడం జరిగింది.
అనంతరం ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ అధికారులు మాట్లాడుతూ… ఆత్మహత్యల నివారణ లోని పలు అంశాల గురించి మరియు ఏ విధంగా ఆత్మహత్యల నివారణ కోసం చర్యలు తీసుకోవాలి అన్న విషయాలను తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో డి.ఐ.జి. రాజ శేఖర్ బాబు ఐ.పి.ఎస్., డిప్యుటీ పోలీస్ కమీషనర్లు విశాల్ గున్ని ఐ.పి.ఎస్., మేరి ప్రశాంతి ఐ.పి.ఎస్., ఇతర పోలీస్ అధికారులు, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ వారు డా.వై ప్రభాకర్, డా. ఐ.వి.ఎల్.నరసింహారావు, డా.జి.వి.ఎస్. మూర్తి, డా. రామ సుబ్బారెడ్డి, డా.టి.పి.సుధాకర్, ఇతర డాక్టర్లు , సిబ్బంది మరియు ఎన్.టి.ఆర్ యునివర్సిటి అనుబంధ కళాశాల ల నుండి సుమారు 1400 మంది విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.