గరిష్ట వేగానికి అనుమతి…

-దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్‌, విజయవాడ & గుంతకల్‌ డివిజన్లలోని
అధిక సెక్షన్లలో 12 సెప్టెంబర్‌ 2022 నుండి రైళ్లు గంటకు 130 కి.మీల గరిష్ట వేగంతో నడుస్తాయి
-సికింద్రాబాద్‌ డివిజన్‌లోని సికింద్రాబాద్‌-కాజీపేట్‌-బల్లార్ష, కాజీపేట్‌-కొండపల్లి, విజయవాడ డివిజన్‌లోని కొండపల్లి – విజయవాడ-గూడూరు, గుంతకల్‌ డివిజన్‌లోని రేణిగుంట-గుంతకల్‌-వాడి సెక్షన్లలో గరిష్ట వేగానికి అనుమతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్‌, విజయవాడ మరియు గుంతకల్‌ డివిజన్లలోని అత్యధిక సెక్షన్లలో రైళ్ల సరీస్వులను గంటకు గరిష్టంగా 130 కిమీల వేగంతో నడపడానికి అనుమతించడంతో రైళ్ల వేగంలో జోన్‌ మరో మైలురాయిని అధిగమించింది. ఈ సెక్షన్లలో వేగవంతంగా ఒక క్రమపద్ధతి ప్రకారం చర్యలు తీసుకుంటూ మరియు ట్రాక్‌లను పటిష్టపరుస్తూ & ఏవైనా అడ్డకులుంటే వాటిని తొలగిస్తూ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ పలు చర్యలు తీసుకోవడంతో జోన్‌ ఈ లక్ష్యాన్ని సాధించింది. 2020 సంవత్సరంలో ఆర్‌డిఎస్‌ఓ/లక్నో వారు అనుమతులు మంజూరు చేశాక మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు, నిర్వహణ పనులు మరియు సిగ్నలింగ్‌ సంబంధిత పనులు నిరంతరం నిర్వహించబడ్డాయి. ఈ సెక్షన్లలో అభివృద్ధి పనులు విస్తృతంగా చేపట్టాక రైళ్ల సర్వీసులను 12 సెప్టెంబర్‌ 2022 తేదీ నుండి గంటకు 110 కిమీల నుండి పెంచుతూ 130 కిమీల వేగంతో నడపడానికి ఇప్పుడు అనుమతులు ఇవ్వబడ్డాయి.

ఈ వేగం పరిమతి పెంపు అమలులోకి వచ్చే సెక్షన్లు : సికింద్రాబాద్‌ డివిజన్‌లోని సికింద్రాబాద్‌-కాజీపేట్‌-బల్లార్ష, కాజీపేట్‌-కొండపల్లి సెక్షన్లు, విజయవాడ డివిజన్‌లోని కొండపల్లి-విజయవాడ-గూడూరు, గుంతకల్‌ డివిజన్‌లోని రేణిగుంట-గుంతకల్‌-వాడి సెక్షన్లు. దక్షిణ మధ్య రైల్వేలో ఈ సెక్షన్లు మొత్తం రద్దీగా ఉంటాయి, స్వర్ణ చతుర్భుజి మరియు స్వర్ణ వికర్ణ మార్గాలుగా ఉన్నాయి. వీటిలో స్వర్ణ వికర్ణ మార్గంలో విజయవాడ ` దువ్వాడ మధ్య సెక్షన్‌ను మినహాయించబడిరది. ఇక్కడ వేగం పెంపుకు సంబంధించిన పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.
ఈ సెక్షన్లలో గరిష్ట వేగం అనుమతులు లభించిన ఫలితంగా ప్రయాణికుల రైళ్లతో పాటు సరుకు రవాణా రైళ్ల సగటు వేగం కూడా పెరుగుతుంది. ఇది రైళ్ల సమయపాలనపై సానుకూలమైన ప్రభావం చూపుతుంది. ప్రధానంగా, గరిష్ట వేగం అనుమతితో ముఖ్యమైన మరియు రద్దీ అయిన ఈ ప్రాంతాలలో సెక్షనల్‌ సామర్థం పెరుగుతుంది.
జోన్‌లో గంటకు 130 కిమీల సెక్షనల్‌ వేగం పెంపుకు సంబంధించన పనులను పూర్తి చేయడంలో నిరంతరం కృషి చేసిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు మరియు సిబ్బంది బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌చార్జి) అరుణ్‌ కుమార్‌ జైన్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సెక్షనల్‌ వేగం పెంపుతో ప్రయాణికుల రైళ్ల రవాణా సమయం గణనీయంగా తగ్గుతుందని, రైలు సజావుగా సాగేందుకు మార్గం సుగమం అవుతుందని ఆయన అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *