వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో మెరుగైన ప్రజల జీవన విధానాలు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపి వారికి మెరుగైన జీవన విధానాలు అందించారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 19వ డివిజన్ 87వ సచివాలయ పరిధిలోని రెహమత్ నగర్,ఆర్&బి కోర్టర్స్ రోడ్,గాంధీ కాలనీ,ఎలక్ట్రిసిటీ కాలనీ ప్రాంతాల్లో ఇంటింటికీ పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఈ ప్రభుత్వం వచ్చిన మూడేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గురుంచి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అధికారంలోకి వచ్చిన ఆనతి కాలంలోనే ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన 90 శాతం పైగా హామీలను అమలు చేసిన ఘనత జగన్ గారిదే అని,తన సుదీర్ఘ పాదయాత్ర లో ప్రజల కష్టాలను స్వయంగా చూసి వారికి మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యం గా పరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. గతంలో ఈ ప్రాంతంలో తిరగాలి అంటేనే పరిసరాలు అపరిశుభ్రంగా ఉండి, అసలు మౌలిక సదుపాయాలు ఉండేవి కాదని,కానీ నేడు వైస్సార్సీపీ పాలనలో రోజు కూడా పారిశుద్ధ్య కార్మికులు విధిగా పరిసరాలను పరిశుభ్రం చేస్తూ,మంచి నీటి సరఫరా గాని,డ్రైనేజీ వ్యవస్థ గాని బాగుపడ్డాయి అని ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు.తెలుగుదేశం ప్రభుత్వం లో పెళ్లికానుక అనేది కేవలం ప్రకటన లకే పరిమితం అని లబ్ధిదారులు ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. అక్టోబర్ 1 నుండి వైయస్సార్ కల్యాణమస్తు,షాధి తోఫా అందించడానికి చర్యలు చేపట్టారు అని,జగనన్న నాయకత్వం లో బీసీ,ఎస్సి,ఎస్టీ,ముస్లిం మైనారిటీల పెళ్లికి ఆర్థిక సాయం చేయడం జరుగుతుందని అవినాష్ అన్నారు.ఇన్ని మంచి కార్యక్రమాలతో ప్రభుత్వం ముందుకు వెళుతుంటే వారి రాజకీయ మనుగడ కోసం తెలుగుదేశం నాయకులు జగన్ గారి కుటుంబ సభ్యులు మీద,ఇళ్లలో ఆడవాళ్ళ మీద అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ,దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. విలువలు లేని రాజకీయాలు చేస్తున్న టీడీపీ వారి తీరును ప్రజలు కూడా అసహించుకొంటున్నారని,రాబోయే రోజుల్లో వారే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తదనంతరం ఎలక్ట్రాసిటీ కాలనీ నందు నగర పాలక సంస్థ చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని అవినాష్ ప్రారంభించి చెట్లు నాటి నీరు పోశారు.

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు యస్సీ, యస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ వర్గాలతో పాటు వికలాంగులు, భవన నిర్మాణ కార్మిక పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహలు సందర్భంగా వారికి అండగా నిలిచి ఆదుకునేందుకు వైయస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా పథ‌కాల ద్వారా ఆర్ధిక సహాయం అందజేసే కార్యక్రమాన్ని చేపట్టి మేనిఫెస్టోలో 98.55 శాతం హామీలు అమలు చేశారు అని అవినాష్ తెలిపారు. ఈ పథకం వచ్చే అక్టోబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతుంది అని గత ప్రభుత్వంలో ఏదో లబ్ధిదారులను మభ్య పెట్టేందుకు ఎన్నికల ముందు చాలీ చాలని నిధులతో పథకాన్ని అటక ఎక్కిస్తే మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాత్రం ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ, ఎస్టీలకు లక్ష రూపాయలు, ఎస్సీ ఎస్టీ కులాంతర వివాహాలకు 1.20 లక్షల రూపాయలు, బిసి లకు 50 వేళ రూపాయలు, బిసి కులాంతర వివాహాలకు 75 వెలు, మైనారిటీలకు లక్ష రూపాయలు, వికలాంగులకు లక్ష రూపాయలు, భవన నిర్మాణ కార్మికులకు 40 వేళ రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది అని తెలిపారు. కాబట్టి ఆయా వర్గాల ప్రజానీకం అంతా ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,19వ డివిజన్ కార్పొరేటర్ రహేన నాహిద్,కో ఆప్షన్ మెంబెర్ అలీమ్,సీనియర్ నాయకులు వలి, వైస్సార్సీపీ నాయకులు నహీద్, షేక్ సుభాని,జగ్జీవన్ రావ్, చింతగుంట విజయ్, పోతురాజు, నూరి, ప్రసాద్ తిరుపతి,నాగ లత సలీం,పిల్లి వెంకట్, రాము రత్నకుమారి,అనిత, రమ, భత్తులు నాగేశ్వరరావు, అబ్బాస్.బినియమిన్, బాబు బాయ్ ,అస్గర్ ఏసుబాబు, ప్రతాప్, మౌలాలి ,రామ్,జావిద్ పటాన్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *