-ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తాం.. ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయండి…
-ఏపి హౌసింగ్ కార్పొరేషన్ యండి భరత్‌గుప్తా
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
జగనన్న కాలనీలలో గృహ నిర్మాణాలకు నిధుల కొరత లేదని ఎప్పటికప్పుడు నిధులను విడుదల చేస్తామని పనులను వేగవంతం చేసి నిర్మాణాలను పూర్తి చేయాలని ఏపి హౌసింగ్ కార్పొరేషన్ యండి. భరత్‌గుప్తా తెలిపారు.
ఎన్‌టిఆర్ జిల్లాలో జగనన్న కాలనీలలో గృహ నిర్మాణాల ప్రగతి పై సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏపి హౌసింగ్ కార్పొరేషన్ యండి భరత్‌గుప్తా, జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావులు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో భరత్‌గుప్తా మాట్లాడుతూ జగనన్న కాలనీలలో గృహ నిర్మాణాల ప్రగతిని గౌరవ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిశితంగా పరిశీలిస్తున్నారన్నారు. జిల్లాలో 83,633 గృహలను మంజూరు చేయగా ఇప్పటి వరకు 3వేల గృహ నిర్మాణాలను పూర్తి చేయగా వివిధ దశలలో ఉన్న గృహ నిర్మాణాలను పూర్తి చేసేందుకు పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. జగనన్న కాలనీలలో మౌలిక వసతుల ఏర్పాటుకు గృహ నిర్మాణాలను చేపట్టిన లబ్దిదారులకు, ఎజెన్సీలకు ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేసేందుకు సిద్దంగా
ఉన్నామన్నారు. పనులకు సంబంధించిన బిల్లులను అప్లోడ్ చేసిన వెంటనే నిధులు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లబ్ధిదారులకు మంజూరైన గృహాలకు సంబంధించి మున్సిపల్ అధికారులు పెండిరగ్ బిల్లులను వెంటనే అప్లోడ్ చేయాలని అవసరమైతే అడ్వాన్స్ బిల్లులకు ప్రతిపాదనలు పంపితే నిధులను విడుదల చేస్తామన్నారు. గ్రామీణ ఉపాధి హామి పథకం కింద పనులకు సంబంధించి బిల్లులను అప్లోడ్ చేయడంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది వెంటనే సరైన పద్దతిలో బిల్లులను అప్లోడ్ చేసి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలను పంపితే నిధులను విడుదల చేస్తామని నిర్థేశించిన గడువులోగా గృహ నిర్మాణాలను పూర్తి చేసి పేదవారి సొంత ఇంటి కలను నేరవేర్చాలని కోరారు.
జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు మాట్లాడుతూ జగనన్న కాలనీలో గృహ నిర్మాణాల ప్రగతిని ప్రతి వారం సమీక్షించి పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. జగనన్న కాలనీలలో పనులు చేపట్టేందుకు టెండర్లను పిలవడం జరిగిందన్నారు. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో నామినేషన్ పద్దతులలో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 303 లేఅవుట్ల ద్వారా 83,633 గృహాలు మంజూరు కాగా వీటిలో 76,669 రిజిస్ట్రర్ అయ్యాయని మరో 6,964 గృహాలు రిజిస్ట్రర్ కావాల్సివుందన్నారు. 5వేల గృహాలు ప్రారంభించవలసి ఉందని లబ్దిదారులను చైతన్యవంతులు చేసి గృహ నిర్మాణాలు చేపట్టేవిధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సుమారు 51 వేల గృహాలు బిలో బెస్మెంట్ లెవల్‌లోను 11 వేల గృహాలు బెస్మెంట్ లెవల్‌లోను 1750 గృహాలు రూప్ లెవల్‌లోను 4వేల గృహాలు రూప్ క్యాస్టింగ్‌లో ఉండగా 3వేల గృహాలను పూర్తి చేసిన్నట్లు జిల్లా కలెక్టర్ ఏపి హౌసింగ్ కార్పొరేషన్ యండి భరత్‌గుప్తాకు వివరించారు.
సమావేశంలో హౌసింగ్ స్పెషల్ ఆఫీసర్ శివప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, డ్వామా పిడి జె. సునీత, వియంసి అడిషనల్ కమీషనర్ సత్యవతి, హౌసింగ్ పిడి కె.శ్రీదేవి, ఇఇ రవికాంత్ తదితరులు
ఉన్నారు.