రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజా వార్త :
అర్హులైన వారికి, దివ్యాంగులకు ప్రభుత్వం పరంగా సహాయ సహకారాలు అందించడం జరుతోందని జిల్లా కెలెక్టరు కె. మాధవీలత తెలిపారు. సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా గతంలో ట్రై సైకిళ్ళ కోసం ధరఖాస్తు చేసుకున్న దివ్యాంగులైన ఇద్దురు లబ్దిదారులకు విభిన్న ప్రతిభావంతుల శాఖ ద్వారా ట్రై సైకిళ్ళు ఉపకరణాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ గతంలో స్పందనలో కార్యక్రమంలో ట్రై సైకిళ్ళ కోసం ధరఖాస్తు చేసుకున్నారని నేడు లబ్దిదారులకు అందజేయడం జరిగిందన్నారు. ట్రైసైకిళ్లు అందుకున్నవారిలో దివ్యాంగులైన నల్లజర్ల మండలం అనంతపురం గ్రామానికి చెందిన కొట్టా మహాలక్ష్మయ్య, రాజమండ్రి అర్బన్ నివాసి మడకం సాయికుమార్ ల ఇరువురకు ఒక్కొక్క ట్రైసైకిళు ₹ 8 వేల రూపాయలు విలువు గల రెండు ట్రై సైకిళ్ళను విభిన్న ప్రతిభావంతుల శాఖ ద్వారా అందజేశారు.
Tags rajamendri
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …