-జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్,
-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
నగర పర్యటనలో భాగముగా మంగళవారం జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, తో కలిసి 32 వ డివిజన్, కేదారేశ్వరరావు పేట, బాపిస్ట్ పాలెం ప్రాంతములో గల 219 వార్డ్ సచివాలయ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖి నిర్వహించారు. సచివాలయ పర్యవేక్షించి సిబ్బంది యొక్క వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేస్తూ, మూవ్మెంట్ రిజిస్టర్, పెన్షన్ వివరాలు, ప్రజల నుండి వచ్చిన అర్జిలను నమోదు చేయు రికార్డ్ లు సక్రమముగా నిర్వహిస్తున్నది లేనిది పరిశీలించారు. ఈ సందర్భంలో వార్డ్ సచివాలయం నందు విధిగా ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పధకముల యొక్క పోస్టర్స్ మరియు అర్హుల జాభితాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశిస్తూ, క్షేత్ర స్థాయి సిబ్బంది భాద్యతగా వారికీ కేటాయించిన విధులను నిర్వహించి ప్రజలకు సంక్షేమ పథకములపై సమగ్ర అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు దగ్గరగా ఉంటూ మెరుగైన సేవలు అందించడంతో పాటు సచివాలయానికి వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరం చూపాలని, విధి నిర్వహణలో ఉన్న సచివాలయ సిబ్బంది భాద్యతాయుతంగా తమ విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందించేలా చూడాలని, విధి నిర్వహణలో అలసత్వం వహించు సిబ్బందిపై చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ హెచ్చరించారు. పర్యటనలో సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, జోనల్ కమిషనర్-1 సుధాకర్, ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ నారాయణ మూర్తి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.