-జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్,
-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ మరియు జాయింట్ కలెక్టరు, ఎన్.టి.ఆర్ జిల్లా ఉదయం10.00 గంటలకు క్షేత్ర స్థాయిలో అధికారులతో కలసి 62వ డివిజన్ లోని పాకిస్తాన్ కాలనీ, బర్మా కాలనీ మరియు రాధానగర్ ఏరియాల నందు విస్తృత పర్యటన జరిపినారు. సదరు పర్యటనలో భాగముగా ఆ ప్రాంతములలో నివాసముంటున్న వారి యొక్క ఇంటింటికి తిరిగి వారు నివసిస్తున్న ఇంటి స్థలములకు సంబందించి పట్టాలుగానీ , కన్వేయన్స్ డీడ్స్ గానీ మరియు ఇతరత్రా ఆధారములు వుండియున్నావా లేవా అని అక్కడి నివాసితులను విచారించి తెలుసుకొనియున్నారు.
తదుపరి సదరు పట్టాలు గానీ , కన్వేయన్స్ డీడ్స్ గానీ లేని వారి వివరములు సేకరించుట గురించి మరియు తదుపరి చర్యల నిమిత్తం మున్సిపల్ మరియు రెవిన్యూ శాఖల అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగినది మరియు సదరు వివరములు సేకరించుటకు గాను టీమ్స్ ను ఏర్పాటు చేసి పూర్తి వివరములను సేకరించవలసినదిగా ఆదేశించియున్నారు. సదరు పర్యటనలో భాగంగా కమిషనర్,విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ వారు, ఆ ప్రాంతములలో సానిటేషన్ గురించి పరిశీలించి అక్కడ ప్రజలను విచారించగా వారు సంతృప్తి వ్యక్తం చేసినారు.