-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
-అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించేందుకే ‘‘గడపగడపకు మన ప్రభుత్వం’’…
-శాసనసభ్యులు మల్లాది విష్ణువర్థన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని సత్వర పరిష్కరించడంతోపాటు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందించనునట్లు జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్లు తెలిపారు.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్లు 61 డివిజన్లోని 261వ సచివాలయం పరిధిలోగల పశాంతి నగర్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియో ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా స్థానిక అధికారులు ప్రజా ప్రతినిధులతో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకుంటున్నామని తెలిపారు. ఇంటింటిని సందర్శించిన్నప్పుడు ప్రజలు తమకు ప్రభుత్వ పథకాల లబ్ది చేకూరలేదని తమ దృష్టికి తీసుకువస్తే అక్కడక్కడే సంబంధిత అధికారుల సమక్షంలో విచారించి అర్హత ఉన్నట్లయితే వారిని లబ్దిదారుల జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రశాంతి నగర్ ప్రాంతంలో స్థానికంగా ఎక్కువ సమస్యలు లేనప్పటికి ఖాళీవేసిన స్థలాలు వల్ల చుట్టు పక్కల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ఖాళీస్థలాల యజమానులకు వెంటనే నోటీసులు జారీ చేసి నిర్మాణాలను చేపట్టడం లేదా స్థలాలలను మెరక చేసుకునేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ రెవెన్యూ అధికారలను ఆదేశించామని నోటీసులకు కూడా స్పందించని పక్షంలో పబ్లిక్ హెల్త్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు అవసరమైన చోట్ల స్పీడ్బ్రేకర్లను ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. జిల్లాలో 605 గ్రామ సచివాలయలు ఉన్నాయన్నారు. ఇప్పటివరకు 153 సచివాలయాలకు సొంతభవనాల నిర్మాణాలు పూర్తి అయ్యాయని వాటిలో 123 అర్భన్ ప్రాంతంలో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాలయ నిధులు మంజూరు చేయడం జరిగిందని వీటిని ప్రాధాన్యత పరమైన పనులకు వినియోగించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్ మాట్లాడుతూ ప్రజలు వారి సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధుల వద్దకు వెళడం కాకుండా ప్రజాప్రతినిధులే ప్రతి ఇంటిని సందర్శించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాల గురించి వివరించాలని ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుని ఆర్జీలను స్వీకరించి వాటిని పరిష్కరించాలన్న లక్ష్యాంతో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు. నియోజకవర్గంలోని అనేక ప్రాంతాలలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో గడపగడపకు మన ప్రభుత్వాని నిర్వహిస్తున్నారన్నారు. స్థానికంగా చిన్నచిన్న సమస్యలను కూడా అధికారులు నిర్లక్ష్యం చేయడం వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుందన్నారు. ప్రశాంతినగర్ ప్రాంతంలో 12 ఖాళీ స్థలాలను గుర్తించడం జరిగిందని వాటిలో వర్షపు నీరు చేరడం పిచ్చి మొక్కలు పెరగడంతో దోమలు విషపురుగులు చేరడంతో ప్రజలు అసౌకర్యానికి గురి అవుతున్నారన్నారు. ఖాళీ స్థలాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించామన్నారు.డ్రైనేజి వీధిదీపాలు స్పీడ్ బ్రేకర్ల వంటి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామన్నారు. సచివాలయానికి మంజూరు చేసిన 20 లక్షల రూపాలయ నిధులతో మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మల్లాదివిష్ణువర్థన్ తెలిపారు.
గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో డిప్యూటి మేయర్ అవుతు శ్రీ శైలజా, స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి, కోఆప్షన్ సభ్యుడు నందేపు జగదీష్, 30వ డివిజన్ కార్పొరేటర్ బి. జానారెడ్డి స్థానిక నాయకులు ఉమ్మడి వెంకటరావు, తాశీల్థార్ చందన దుర్గాప్రసాద్, నగరపాలక సంస్థ సర్కిల్ 2 జోనల్ కమీషనర్ ఇంచార్జి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.