విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
నగర ప్రాంత పరిధిలో స్థలాల క్రమబద్దీకరణకు ఆధారానికి సంబంధించిన వివరాలను అధికారులకు అందించాలని జాయింట్ కలెక్టర్ ఎన్ నుపూర్ అజయ్ అన్నారు. నగర పాలక సంస్థ నార్త్ మండలం పరిధిలోని పాకిస్తాన్ కాలనీ, బర్మాకాలనీ, రాధ నగర్ ప్రాంతాలలో మంగళవారం జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్‌తో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఆయా ప్రాంతాలలో నివాసం వుంటున్న నివాసితులతో జాయింట్ కలెక్టర్ మాట్లాడి ఇంటి స్థలాలకు సంబంధించి పట్టాలు గాని, కన్వేయన్స్ డీడ్స్ ఇతర రుజువు ఆధారాలపై నివాసితులను విచారించారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులు టీమ్‌లుగా క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి వివరాలను సేకరించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. కాలనీ పరిశరాలలో శానిటేషన్‌ను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. పర్యటనలో నార్త్ తహాశీల్థార్ దుర్గాప్రసాద్ ఉన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …