కవి, రచయిత, గుంటూరు -2 డిపో కండక్టర్ నాగేశ్వరరావుని సత్కరించిన ఆర్టీసీ ఎం.డి. సి.హెచ్. ద్వారకాతిరుమల రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
రాష్ట్రస్థాయిలో కవిగా, రచయితగా, మరియు వ్యాస కర్తగా గుర్తింపు తెచ్చుకున్న గుంటూరు-2 డిపో కండక్టర్ ఆళ్ళ నాగేశ్వరరావుని సంస్థ ఎం.డి.  సి.హెచ్. ద్వారకాతిరుమల రావు, ఐ.పి.ఎస్. బుధవారం ఆయన ఛాంబర్ లో పుష్ప గుచ్ఛాన్ని అందించి, శాలువాతో ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు.
ఆర్టీసీలో ఎందరో కళాకారులు, ప్రతిభావంతులు తమ ప్రతిభా పాటవాలతో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఆ కోవలోనే తన రచనలతో, సాహిత్యంతో ఆర్టీసీకి పేరును మరింతగా ఇనుమడింపజేస్తున్న గుంటూరు-2 డిపో కండక్టర్ ని సతీ సమేతంగా ఆహ్వానించి, ఆర్టీసీ అధికారుల సమక్షంలో సత్కరించారు.
ఆళ్ళ నాగేశ్వరరావు 1998వ సంవత్సరం పొన్నూరు డిపోలో కండక్టర్ గా నియమింపబడి, అనంతరం గుంటూరు-2 డిపోకి బదిలీ అయ్యారు. అప్పటినుండి గుంటూరు-2 డిపోలో విధులు నిర్వర్తిస్తూ, గత ౩౩ సంవత్సరాలుగా వృత్తి పట్ల అంకితభావంతో పనిచేస్తూ, ఆర్టీసీ అధికారుల మన్ననలు పొందడమే కాకుండా, కవిత్వంలో, సాహిత్యంలో ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా పొందారు. వ్యాసాలు, కధలు, కవితలు, శీర్షికలు అన్నీ కలుపుకుని ఇప్పటివరకు దాదాపుగా 500 వరకు రచనలు సాగించారు. తాను పనిచేసిన ప్రతిచోట తోటి ఉద్యోగుల, అధికారులందరితో ప్రశంసలు పొందారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ మరియు ప్రపంచ స్థాయిలో జరిగిన ఎన్నో సాహిత్య పోటీలలో బహుమతులు గెలుచుకున్నారు. వాటిలో ముఖ్యంగా ‘తానా అవార్డు’, అమెరికా వారి ‘ఆటా అవార్డు’, ముంబై తెలుగు మీడియా వారి ‘ఆంధ్ర సాహిత్య రత్న‘ పురస్కారం, ‘గురజాడ వారి సాహిత్య పురస్కారం’, మార్కాపురం ‘టంగుటూరి ప్రశంసా పురస్కారం’ ఇలా ఎన్నెన్నో అవార్డులు శ్రీ నాగేశ్వరరావు అందుకున్నారు. 2008 లో జరిగిన అమెరికా ఆటా వారి అవార్డుకు గాను ప్రసంశ పత్రాన్ని, రూ.50 డాలర్ల చెక్కును గెలుచుకున్నారు. ఇటీవల ఎన్టీఆర్ జాతీయ పురస్కారం మరియు ANR పురస్కారాలతో పాటు 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో భాగంగా నిజామాబాదులో నిర్వహించిన కవితల పోటీలో బహుమతి కూడా అందుకుని ప్రశంసలు పొందారు. ఇక ఆర్టీసీ గత నెలలో నిర్వహించిన కార్గో మాసోత్సవాల్లో “ముందడుగు” అనే కవితా శీర్షికను పాట రూపంలో రచించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ పాట ద్వారా ప్రజలకు ఆర్టీసీని మరింత దగ్గర చేసే విధంగా కార్గో అభివృద్ధికి దోహదపడ్డారు కూడా. ప్రాచుర్యం పొందిన ఈ కవితను ఈ రోజు ఎం.డి.  మరియు ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ల సమక్షంలో చదివి వినిపించి ఆహ్లాద పరచారు .
మునుముందు మరెన్నో అవార్డులు సాధించి, అటు సంస్థకు కూడా పేరు తీసుకు వచ్చేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా నాగేశ్వరరావు తెలిపారు. సంస్థ ఎం.డి. సి.హెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్.స్వయంగా పిలిచి తనని అభినందించడం చాలా ఆనందంగా ఉందని, ఎంతో స్పూర్తి నిచ్చిందని కండక్టర్ నాగేశ్వరరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఏ. కోటేశ్వరరావు (అడ్మిన్), కే.ఎస్.బ్రహ్మానంద రెడ్డి (ఆపరేషన్స్), ఎఫ్. ఏ. & సి.ఏ.ఓ. రాఘవ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *