విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
జగన్ ప్రభుత్వ పనితీరుపై నిజంగా మీకు మనసా, వాచా, కర్మనా నమ్మకం ఉన్న పక్షంలో రాజీనామా చేసి ప్రత్యక్ష బరిలో నిలవాలని తెదేపా నేత ఎం.ఎస్. బేగ్ బుధవారం ఒక ప్రకటనలో ఎమ్మెల్యే వెలంపల్లి వ్యాఖ్యల పై ప్రతి సవాల్ విసిరారు. బుధవారం నాటి గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో వెలంపల్లి తెదేపాపై వ్యాఖ్యలు చేయటంపై బేగ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. ఎం.పి. కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లను రాజీనామా చేసి మళ్ళీ గెలుపొందాలని సవాల్ విసరడం ‘పిచ్చోడి చేతిలో రాయి’ ని తలపిస్తోందని ఎద్దేవా చేసారు. ప్రభుత్వ పని తీరుపై నీకే అంత గట్టి నమ్మకం ఉంటే… నువ్వే రాజీనామాకు సిద్దపడి బరిలో దిగొచ్చు. కదాని సవాల్ విసురుతున్నానన్నారు. రాష్ట్రం కోసం ప్రధాని పదవిని, నగరాభివృద్ధి కోసం తమ తమ వ్యాపారాలను త్యాగం చేసిన త్యాగధనులు చంద్రబాబు, కేశినేని నాని, గద్దె రామ్మోహన్ ని ఈ సందర్భంగా ఉదహరిస్తూ కొనియాడారు. నాని, రామ్మోహన్, తెదేపాల దమ్ము ధైర్యాలను ప్రశ్నించడం మాని అసలు మీకున్న దమ్ము, ధైర్యం ఏపాటిదో అందరికీ తెలుస్తోందన్నారు. అవినీతి అంచుల్లో పీకల్లోతు మునిగిన వెలంపల్లి ఇకపై సవాళ్ళు ప్రతి సవాళ్లుకు దిగితే.. పరాభవం తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నానని అన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …