రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజా వార్త :
తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల నమోదు అధికారులను ( ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్) నియమిస్తూ ప్రధాన ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని పేర్కొన్నారు.
అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా:
అనపర్తికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(లు), గెయిల్ (ఇండియా) లిమిటెడ్, రాజమహేంద్రవరం ఏబీవీఎస్బి శ్రీనివాస్, రాజానగరం కి ప్రత్యేక కలెక్టర్ (ఎల్ ఏ), పి. ఐ.పి. రాజమహేంద్రవరం , రాజమహేంద్రవరం అర్బన్ కి మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, రాజమహేంద్రవరం గ్రామీణ కి రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. చైత్ర వర్షిణి, కొవ్వూరు (ఎస్ సి) కి కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లి బాబు, నిడదవోలు కి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పి ఐ పి ఆర్ ఎమ్ సి యూనిట్-I, కొవ్వూరు కే. గీతాంజలి, గోపాలపురం (ఎస్ సి)స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎల్ ఏ) ఓ ఎన్ జి సి, రాజమహేంద్రవరం తెం. రాజు ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలియచేశారు.