-రూ.32.99 లక్షలతో నాడు నేడు పాఠశాల పనుల ప్రారంభోత్సవం
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
చిట్టినగర్ 49వ డివిజన్ మట్టా లాజరస్ నగరపాలకసంస్థ ప్రాధమిక పాఠశాలలో రూ. 32.99 లక్షల అంచనాలతో నాడు నేడు పాఠశాల పనులను పశ్చిమ నియోజక శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, మరియు స్థానిక కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ తో కలసి ప్రారంభించారు. వెలంపల్లి శ్రీనివాసరావు విద్యాలయాల్లో వసతులను మెరుగుపరిచి విద్యార్థులకు చక్కటి విద్యను అందజేసేందుకు జగనన్న ప్రభుత్వం కృషిచేస్తోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయడం కోసం జగనన్న ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమాన్ని చేపట్టి పాఠశాలలను అభివృద్ధి చేస్తోందని అన్నారు. అదే విధంగా నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి మాట్లడుతూ అమ్మ ఒడి పథకం, జగనన్న విద్య దీవెన, జగనన్న గోరుముద్ద వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని, ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ గారి ప్రభుత్వం విద్యకు ప్రధమ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. నాడు-నేడు రెండవ విడతగా మరిని పాఠశాలలో విద్యార్ధులకు మౌలిక వసతులను మేరుగుపరచుట జరుగుతుందని అన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని అన్ని పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.