ఆర్థిక సహాయం అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
రాజకీయాలకు అతీతంగా కులమత బేధాలు లేకుండా ఆపదలో ఉన్న నిరుపేదలకు విద్య, ఉపాధి కల్పన కొరకు విజయవాడ నగరంలో చేపడుతున్నట్టు ట్రస్ట్ చైర్మన్ దేవినేని అవినాష్ అన్నారు. గత ఐదు సంవత్సరాలు నుండి ట్రస్టు తరఫున అనేక సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ,ప్రజలకు దేవినేని నెహ్రూ ట్రస్ట్ ‌ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ లో పర్యటించినప్పుడు నిరుపేద వృద్ధులు అజీమున్నీసా, వొదుల మేరీ లు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం అవినాష్ దృష్టికి తీసుకురాగా బుధవారం నాడు వారికి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మొత్తం 10000 రూపాయలు చెరొక 5000 రూపాయలు వైద్య ఖర్చులు నిమిత్తం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరంలో విద్య, వైద్య, ఉపాధి రంగాలలో అనేక సేవ కార్యక్రమాలు చేపడుతున్నాం అని అన్నారు. భవిష్యత్తు లో ఇలాగే అవసరమైన నిరుపేద కుటంబాలకు దేవినేని నెహ్రు ట్రస్ట్ ద్వారా సేవ కార్యక్రమాలు కొనసాగిస్తాం అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,కార్పొరేటర్ రహేన నాహీద్,వైస్సార్సీపీ నాయకులు నాహీద్,శోభన్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *