విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
జగనన్న లేఅవుట్లలో గృహ నిర్మాణాలను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ అధికారులను ఆదేశించారు. నగరంలోని కలక్టరేట్ నుండి గృహ నిర్మాణాల ప్రగతిపై బుధవారం జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, తహశీల్థార్లు, మున్సిపల్ కమిషనర్లు, గృహ నిర్మాణశాఖ ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న లేఅవుట్లలో గృహా నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్థేశించిన గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాల్సిన భాధ్యత అధికారులపై ఉందన్నారు. గృహ నిర్మాణాల ప్రగతిపై ప్రతి వారం లక్ష్యాలను సమీక్షిస్తున్నామన్నారు. నిర్మాణాలలో స్టేజ్ కన్వర్షన్ తప్పనిసరిగా జరగాలన్నారు. డిసెంబర్ మాసాంతానికి 15 వేల గృహ నిర్మాణాలను పూర్తిచేయాలన్న లక్ష్యాన్ని అధికారులు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. బిలో బేస్మింట్, బేస్మింట్, రూఫ్, రూఫ్ కాస్టింగ్, స్థాయిలో ఉన్న నిర్మాణాలను పూర్తి చేసేందుకు లక్ష్యాలను నిర్థేశించుకుని అమలు చేయాలన్నారు. వారం వారిగా నిర్థేశించిన లక్ష్యాలను పూర్తి చేయడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ కొండపల్లి, తిరువూరు నందిగామ జగ్గయ్యపేట మున్సిపాలిటిలలో బేస్మింట్ లెవల్, రూఫ్ లెవల్, రూఫ్ కాస్టింగ్ లెవల్‌లో ఉన్న సుమారు 5వేల గృహాలను పూర్తి చేయాలన్నారు. లక్ష్యాలను పూర్తి చేయడంలో అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలన్నారు. నిర్మాణాలలో ఎదురయ్యే సమస్యలను చెక్‌లిస్ట్ చేసుకుని పరిష్కార మార్గాలను అన్వేషించుకుని పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ సూచించారు. కాన్ఫరెన్స్‌లో డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, హౌసింగ్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ వి శ్రీదేవి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రవికాంత్, విజయబాబు,ఖాజావలి, రాంప్రసాద్, మల్లేశ్వరరావు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …