విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
ప్రజలలో రక్తహీనతను నివారించి పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఉపాధి హామి పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా మునగ చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఉపాధి హామి పథకం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ జె. సునీత తెలిపారు. ఉపాది హమీ పథకం కింద మునగ చెట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం మైలవరం మండలం చండ్రగుడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మహిళలకు మునగ చెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు డైరెక్డర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాలింతాలు చిన్నారులు కిశోర బాలకలలో ఎదురయ్య రక్తహీన సమస్యను నివారించేందుకు విరివిగా మునగ చెట్లను నాటాలని శ్రీయుత జిల్లా కలెక్టర్ డిల్లీరావు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. ఆయన ఆదేశాల మేరకు ఉపాధి హామి పథకం ద్వారా జిల్లాలో 1లక్ష 10 వేల మునగ మొక్కలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందులో భాగంగా చండ్రగుడెం పంచాయతీ పరిధిలో ప్రతి ఇంటికి రెండు మొక్కల చొప్పున 5వేల మునగ మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. మునగ ఆకు ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టమైనదని దీనిని ఆహారంగా ఉపయోగించడంద్వారా మూడు వందలకు పైగా వ్యాధులను నయం చేసే గుణం ఉందన్నారు. మునగ ఆకులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయని తద్వారా రక్తహీనతను ఆరికట్టి ఆరోగ్యంలో ఐరన్ శాతాన్ని పెంచుతుందన్నారు. పంపిణీ చేసిన మొక్కలను కొద్ది రోజులు జాగ్రత్తగా సంరక్షించుకుంటే ఎడాది పొడవునా మునగ ఆకును కాయలను వినియోగించుకుని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని ప్రాజెక్టు డైరెక్టర్ సునీత తెలిపారు. మునగ చెట్ల కార్యక్రమంలో యంపిపి ఎల్ ప్రసన్న రాణి, జడ్పిటిసి ఎస్ తిరుపతిరావు, గ్రామసర్పంచ్ బి. శ్రీనివాస్‌రావు యంపిడివో బియం లక్ష్మికుమారి, ఎపియం శ్యామ్, పివో వి వెంకటేశ్వరరావు యంపిటిసి సభ్యులు, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …