Breaking News

యువతకు ఆదర్శం’ జాహ్నవి’

– ఔత్సాహిక పైలట్ ఆస్ట్రోనాట్ ను సన్మానించిన ‘వాసిరెడ్డి పద్మ’
– రూ.50లక్షల ప్రభుత్వ సాయం అందజేతపై ప్రశంసలు

అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త :
పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి బుధవారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను కలిశారు. పైలట్‌ ఆస్ట్రొనాట్‌ అవ్వాలనే తన కల సాకారం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 50 లక్షల సాయాన్ని వివరించారు. నాసా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి భారతీయురాలిగా 19 ఏళ్ల జాహ్నవి దంగేటి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.. గతంలో విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను జాహ్నవి కలిసి .. తన ఆస్ట్రోనాట్ పైలట్ కల గురించి వివరిస్తూ అప్పట్లో వినతిపత్రం అందించగా.. మహిళా కమిషన్ నుంచి ప్రభుత్వానికి సిఫార్సులు వెళ్లాయి. ఆ తర్వాత సీఎం జగన్ రాజమండ్రి పర్యటన సందర్భంలో జాహ్నవి కలవడం.. ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి ఆమెకు రూ.50 లక్షల సాయం అందజేయడం పై వాసిరెడ్డి పద్మ సంతోషం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని మహిళా కమిషన్ కార్యాలయానికి కుటుంబ సభ్యులతో సహా విచ్చేసిన జాహ్నవిని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ దుశ్శాలువాతో సత్కరించి గౌతమ బుద్ధుని ప్రతిమను బహూకరించారు. పైలట్‌ ఆస్ట్రొనాట్‌ అవ్వాలనే తన కోరికను నిజం చేసేందుకు.. శిక్షణకయ్యే ఖర్చుపై సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పూనుకోవడం గొప్ప విషయంగా వాసిరెడ్డి పద్మ చెప్పారు. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ లా అంతరిక్షంలోకి ప్రవేశించాలనే లక్ష్యాన్ని జాహ్నవి త్వరలోనే చేరువవుతుందని ఆమె ఆకాంక్షించారు. ప్రతిభావంతులైన యువతకు జాహ్నవి ఆదర్శమని ఆమె కొనియాడారు. యువత, మహిళల సంకల్పశక్తికి ‘మహిళా కమిషన్’ ఎల్లవేళలా అండగా ఉంటుందని వాసిరెడ్డి పద్మ వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎడిబి 4 వరసల రహదారి పనుల పురోగతి పై క్షేత్ర స్థాయిలో ఉప ముఖ్యమంత్రి తనిఖీ

-గ్రామాల వారీగా పనుల పురోగతిని వివరించిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజానగరం, రంగంపేట, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *