విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక సాంకేతిక పరిశోధనతో రూపొందించబడిన ఆక్యుమిస్ట్ అనే నూతన ఉత్పాదనను మార్కెట్లోనికి విజయవాడ నోవాటెల్ హోటల్ నందు విడుదల చేశారు. ఈ ఆవిష్కరణ ముఖ్య అతిధిగా కోరమాండల్ సంస్థ ప్రెసిడెంట్ యస్.సుబ్రమణ్యం. విశిష్ట అతిధిగా సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కాళిదాన్ ప్రమాణిక్, మరో విశిష్ట అతిధిగా జివి.సుబ్బారెడ్డి- సంస్థ వైస్ ప్రెసిడెంట్, స్పెషాలిటి ఫెర్టిలైజర్స్ విభాగం మాధబ్ అధికారి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి అయిన యస్.శంకర సుబ్రమణ్యం మాట్లాడుతూ కోరమాండల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైతులతో బలమైన బంధాన్ని కలిగి ఉంది. పంటల ఉత్పాదకత మరియు నాణ్యమైన దిగుబడిని పెంపొందించడంలో భాగంగా, కోరమాండల్ ప్రత్యేక పోషకాలు (సూక్ష్మపోషకాలు, ఫర్టిగ్రేషన్ గ్రేడ్లు & కస్టమైజ్డ్ క్రాప్ స్పెసిఫిక్ గ్రేడ్లు) మరియు పోషకాల ఆధారిత స్వచ్ఛమైన సేంద్రీయ ఎరువులు అందించడం ద్వారా రైతులకు అన్ని విధాలుగా సేవలందించేందుకు నిరంతరం కృషిచేస్తుందని తెలిపారు. వైస్ ప్రెసిడెంట్ జివి సుబ్బారెడ్డి మాట్లాడుతూ మా యొక్క ఫెర్టిలైజర్స్ ప్రెసిడెంట్ యస్.శంకర సుబ్రమణ్యం చేతులమీదుగా రైతులు మరియు ఛానల్ భాగస్వాముల హృదయ పూర్వక శుభాకాంక్షల మధ్య మా క్రొత్త లిక్సిడ్ మైక్రో న్యూట్రియంట్ ప్రొడక్ట్ ఆక్యుమిస్ట్ కాల్షియంను ప్రారంభిస్తున్నామన్నారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కాళిదాస్ ప్రమాణిక్ మాట్లాడుతూ నాణ్యమైన ఎరువులను అందించడం కంటే ఎక్కువ సేవా ఆధారిత విధానంతో వ్యవసాయ సమాజానికి సహాయం చేయడానికి కోరమాండల్ చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. స్పెషాలిటీ ఫెర్టిలైజర్స్ విభాగం మాధబ్ అధికారి మాట్లాడుతూ ఆక్యుమిస్ట్ ప్రొడక్ట్ విశిష్టత మరియు ఉపయోగాలు వివరించారు. రైతులు తక్కువ పెట్టుబడితో ఉత్తమ రాబడులను పొందడంలో దోహదపడుతుంది. సామాజిక బాధ్యతగా ఎన్నో సేవా కార్యక్రమాలు-గ్రామీణ బాలికల ఉన్నత చదువుకు ప్రోత్సాహకాలు, కాకినాడలో ఆసుపత్రి ఎన్నో పాఠశాలలు, గ్రామాల్లో త్రాగునీటి ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కోస్తాంధ్ర విభాగం డిజియం కెయస్‌ఆర్ చక్రవర్తి, జోనల్ మేనేజర్లు, విభాగేయ ఆగ్రోనమిస్ట్‌లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
తూర్పు గోదావరి జిల్లా అధికారిక వెబ్సైట్లో ఈ- డిస్ట్రిక్ మేనేజర్’ పోస్టు కు దరఖాస్తు చేసుకున్న అర్హుల తాత్కాలిక జాబితా
-కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న ‘ఈ- డిస్ట్రిక్ …