అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త:
నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ళ స్థలాల కోసం స్థలాలు గుర్తించడం జరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ తెలిపారు. శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి తో కలిసి అనపర్తి నియోజకవర్గం లోనూ బిక్కవోలు, అనపర్తి మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, జిల్లా ఇళ్ళ స్థలాల కోసం ధరకాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఇంటి నిర్మాణం కోసం అనువైన స్థలాలను గుర్తించడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా బిక్కవోలు మండలం మెల్లూరు లో ఒక ఎకరా అరవై సెంట్లు, అనపర్తి మండలం పేరా రామచంద్రపురం లో 9 ఎకరాలు భూమిని గుర్తించామన్నారు. ఈ రోజు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. చైత్ర వర్షిణి ఆధ్వర్యంలో ఆయా మండల తహసీల్దార్ లు, సర్వే అధికారులతో కలిసి క్షేత్ర స్థాయి లో పర్యటించామన్నారు. లబ్దిదారులు చేసుకున్న ధరకాస్తు లను పరిశీలించడం ద్వారా భూసేకరణ కోసం భూముల పరిశీలించడం ఈ పర్యటన ఉద్దేశ్యం అని జాయింట్ కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అర్హత కలిగిన ప్రతి ఒక్క లబ్దిదారునికి స్వంత ఇంటి కల సాకారం కావాలని దృఢ సంకల్పంతో ఉందన్నారు.. స్థలాలు పొందిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఇంటి నిర్మాణం చేపట్టడం కోసం అవసరమైన ఇసుక, సిమెంట్, ఐరన్ తదితర ముడి సరుకులను అందుబాటులో ఉంచడమే కాకుండా ఆర్థికంగా భరోసాను ఇవ్వడం ద్వారా చేయూతను అందిస్తున్నట్లు ఆర్డీవో పేర్కొన్నారు. ఈ పర్యటనలో మండల స్థాయి రెవెన్యూ, హౌసింగ్, సర్వే, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Tags rajamendri
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …