Breaking News

“స్వచ్చతా హీ సేవా” పక్షోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లా గ్రామ స్థాయిలో జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో భాగంగా “స్వచ్చతా హీ సేవా” (పరిశుభ్రతా సేవా కార్యక్రమాలు) పక్షోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పిలుపునిచ్చారు. అందుకు అనుగుణంగా క్షేత్ర స్థాయి లో ప్రతీ ఒక్క గ్రామ పంచాయతీని భాగస్వామ్యం చేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి సమర్థవంతంగా కార్యాచరణ ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో సింగిల్ యుజ్ ప్లాస్టిక్ నిషేధం పై గ్రామ స్థాయి కార్యక్రమాలకి గురువారం జిల్లాలోని 300 పంచాయతీల్లో తీర్మానం చెయ్యడం ద్వారా తొలి అడుగులు వేయడం జరిగిందన్నారు. జిల్లా పంచాయతీ అధికారి పి. జగదాంబ శుక్రవారం జిల్లాలో అమలు చేస్తున్న పరిశుభ్రతా సేవా కార్యక్రమాలు వివరాలు తెలియచేశారు.

ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలతో సెప్టెంబర్ 15 వ తేదీ ఎన్నికయిన ప్రజాప్రతినిధులు, గ్రామ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, గ్రామ పెద్దలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, వాలంటీర్లు తదితరులతో సమావేశం నిర్వహించి నట్లు తెలిపారు. ఆ సమావేశంలో పొడి తడి చెత్త సేకరణ పై ప్రజల్లో అవగాహన కోసం, ఇంటింటి చెత్త సేకరణ, ఎస్ డబ్ల్యూ పి సి, ఆదాయ ఉత్పత్తి, చెత్త కుప్పలు మరియు పేరుకుపోయి ఉన్న డంప్‌లను శుభ్రపరచడం పై గ్రామ సభ నిర్వహించి, పక్షోత్సవాల కార్యాచరణ పై చేర్చిండం జరిగింది. సెప్టెంబర్ 16 న గ్రామాల్లో పై సభ్యులతో కూడిన ర్యాలీలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకుని రావడం జరుగుతుంది.

సెప్టెంబర్ 17 న గ్రామంలోని క్షేత్ర స్థాయి సిబ్బంది తో మరియు ప్రజా ప్రతినిధులను కలుపుకుని అపరిశుభ్రమైన హాని కలిగించే పాయింట్లను గుర్తించడం, చెత్త కుప్పలు పేడ  కుప్పలు నిలిచిపోయిన నీటి పాయింట్లు గుర్తించి అక్కడికక్కడే శుభ్రపరచడం జరుగుతుంది.

సెప్టెంబర్ 19 న గ్రామంలో గుర్తించిన చెత్త కుప్పలను రోడ్లు శుభ్రపరచడం వంటి కార్యకలాపాలు చేపట్టడం

సెప్టెంబర్ 20 న “చెత్త వేయకూడదు” అని ప్రతి ఒక్క బాధ్యతాయుతమైన వ్యక్తి నుండి ప్రతిజ్ఞ / నిబద్ధత లేఖలు తీసుకోవడం జరుగుతుంది.

సెప్టెంబర్ 21 న ఇప్పటికే ఉన్న శానిటరీ వ్యవస్థ యొక్క కార్యాచరణను ధృవీకరణ చేసుకోవడం జరుగుతుంది.

సెప్టెంబర్ 22 న ఎస్ డబ్ల్యూ పి సి (ఘన సంపద ప్రాసెసింగ్ సెంటర్) సందర్శన, నిర్వహణ, మౌలిక సదుపాయాలు, చెత్త వినియోగంపై అవగాహన కార్యక్రమాలు

సెప్టెంబర్ 23 న క్లాప్ మిత్రాలకు సేకరించిన చెత్త ను రెందుదశల్లో వేరుచేయుట, వర్మి ఎరువు తయారీ పై పునఃశ్చరణ తరగతులు నిర్వహణ.

సెప్టెంబర్ 24 న సామూహిక మరుగుదొడ్ల వినియోగం, కాలువలు, నిల్వ ఉన్న నీటి కుంటలను శుబ్రపరిచే కార్యక్రమం

సెప్టెంబర్ 26 న నీటి వనరులు ఉన్న ప్రాంతాల చుట్టుపక్కల శుభ్రపరచడం మరియు సురక్షితమైన తాగునీటిపై ప్రజల్లో అవగాహన కల్పించడం

సెప్టెంబర్ 27 న సింగిల్ యుజ్ ప్లాస్టిక్ నిషేధం, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ & వాటి అమలు నిబంధనలు, ప్రజల్లో అవగాహన కోసం కార్యక్రమాలు.. 50 మైక్రాన్ లోపల ఉండే ప్లాస్టిక్ వినియోగం చేయరాదని ప్రచారం కల్పించడం

సెప్టెంబర్ 28 న ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, ఫ్రీ ప్లాస్టిక్ గ్రామాల కోసం విద్యార్థులు, స్వయం సహాయక సంఘాలు సభ్యులు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి కార్యక్రమాలు

సెప్టెంబర్ 29 స్వచ్ఛత హే సేవ పై పాఠశాల, కళాశాల విద్యార్థులకు వకృత్వ, వ్యాసరచన, క్విజ్ పోటీలు, చర్చలు.

సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 వ తేదీలలో న గ్రామాల్లోని భాగస్వామ్యులను కలుపుకుని గ్రామ స్థాయి లో పరిశుభ్రత పరిరక్షణ కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం

అక్టోబర్ 2 న స్వచ్ఛత హే సేవ గ్రామ సభ నిర్వహణ, గ్రామ స్థాయి లోని కార్యాచరణ ప్రణాళికను ఆమోదించడం

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *