విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం పై మాట్లాడిన వెల్లంపల్లి నోరు అదుపులో పెట్టుకోవాలని కొట్టేటి హనుమంతరావు (మాజీ ఫ్లోర్ లీడర్ పార్లమెంట్ కార్యదర్శి) హెచ్చరించారు. కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో శుక్రవారం జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో కొట్టేటి హనుమంతరావు మాట్లాడుతూ బుద్ధ వెంకన్న ఉత్తరాంధ్ర పర్యటనకు అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చింది ఆ విషయంలో కన్నీరు పెట్టుకున్నారని నువ్వు ఏమన్నా చూసావా అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము ఉన్న నాయకుడు బుద్ధ వెంకన్న, అలాంటి వెంకన్న పై అవాకులు చివాకులు పేలొద్దు అన్నారు. గద్దె రామ్మోహన్ రావు ని రాజీనామా చెయ్యాలని సవాలు విసిరావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే మూడు రాజధానులను ప్రజలు నమ్ముతున్నారని అనుకుంటే, జగన్ మోహన్ రెడ్డి పరిపాలన విధానం బాగుందని నువ్వు అనుకుంటే మీ ముఖ్యమంత్రి చేత మరియు నువ్వు రాజీనామా చేసి గెలువు అని సవాల్ విసిరారు. రాష్ట్రంలో మీ ముఖ్యమంత్రి దగ్గర ఉన్న సర్వే రిపోర్ట్ లో ముందుగా ఓడిపోయేది నువ్వే అని ఉంది అది తెలుసుకో. నీ పశ్చిమ నియోజకవర్గం లో మీ పార్టీలో ఉన్న గ్రూపులు గురించి ఆలోచించుకో. గడప గడపకు వెళ్ళినప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పారిపోతున్నావు.. అలాంటి నువ్వు చంద్రబాబు గురించి మా తెలుగుదేశం పార్టీ నాయకులు గురించి విమర్శించే వాడివా ? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.. 2024లో మీ ముఖ్యమంత్రిని మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారు అని విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కామా దేవరాజు మాట్లాడుతూ బుద్ధ వెంకన్న గురించి మాట్లాడే అర్హత వెల్లంపల్లికి లేదు అన్నారు. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.. ప్రజలు జగన్ మోహన్ రెడ్డిని పరిపాలన చేయమని అధికారం ఇస్తే అరాచక పాలన చేస్తున్నాడని విమర్శించారు. ఈ సమావేశంలో విజయవాడ అర్బన్ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షులు మొహమ్మద్ ఇర్ఫాన్, SC నాయకులు తుపాకుల వెంకటేశ్వర్లు, మామిడి సత్యం, BC నాయకులు పేరం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.