విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్ధానంలో నిర్వహించే శ్రీ శుభకృత్ నామ సంవత్సర దసరా మహోత్సవాలకు విచ్చేయాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులకు దేవస్ధానం అధికారుల ఆహ్వానం అందించారు. దేవస్దానం కార్యనిర్వహణాధికారిణి భ్రమరాంబ , వేదపండితులు మంగళవారం రాజ్ భవన్ కు వచ్చి గవర్నర్ దంపతులకు ఆహ్వాన పత్రికను అందచేసి, నవరాత్రి వేడుకలలో పాలు పంచుకోవాలని విన్నవించారు. ఈ నెల 26వ తేదీ నుండి వచ్చే నెల ఐదవ తేదీ వరకు అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని, ఐదవ తేదీ సాయంత్రం పవిత్ర కృష్ణానదిలో హంస వాహన తెప్పోత్సవం నిర్వహిస్తామని ఇఓ గవర్నర్ దంపతులకు వివరించారు. భక్తులకు ఎటువంటి ఆసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసామని తెలిపారు. అమ్మవారిని సందర్శించుకుంటానని ఈ సందర్భంగా గవర్నర్ పేర్కొన్నారు. వేద పండితులు గవర్నర్ దంపతులను ఆశీర్వదించగా, దేవాలయ కార్యనిర్వహణ అధికారిణి స్వామి వారి ప్రసాదాలు అందచేసారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …