విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రభుత్వం మంజూరు చేసిన తమకు చెందిన భూమిని తన బాబాయ్ ఆయన భార్య పేరుతో పూలింగ్ కు ఇచ్చి సంబంధిత బెనిఫిట్స్ ను బదిలీ చేసుకున్నాడని తుళ్లూరు మండలం, లింగాయపాలెం గ్రామానికి చెందిన ఐనవోలు చంటిబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1973లో మా తండ్రికి 2.89 సెంట్ల వ్యవసాయ భూమిని ప్రభుత్వం మంజూరు చేసింది. సంబంధిత పత్రాలన్నీ మా వద్ద ఉన్నాయి. కుటుంబ అవసరాల నిమిత్తం హైదరాబాద్లో ఉండటంతో మా బాబాయ్ ఐనవోలు కిషోర్ కు కౌలుకిచ్చాము. రాష్ట్ర విభజన జరిగి అమరావతిని రాజధానిగా ప్రకటించి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేసిన ప్పుడు మేము ఫారం 9.3 ఇచ్చాం. 2019లో మా బాబాయి మరికొందరు పెత్తందార్లు అప్పటి అధికారులను మేనేజ్ చేసి రత్నకుమారి పేరున పూలింగ్ కు ఇచ్చి సంబంధిత బెనిఫిట్స్ మొత్తం ఆమె పేరున బదిలీ చేశారు. భూమిని అప్పగించాలని అధికారులను ఎన్నిసార్లు కలిసినా ఫలితం లేదని బాధితుడు చంటిబాబు వాపోయాడు. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని అధికారులను ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.