విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో, బేటీ పడావో (అమ్మాయిలను సంరక్షించండి వారిని విద్యావంతులను చేయండి) నినాదంతో బాలికల రక్షణ, సమృద్ధిలో భాగం గా ప్రారంభించిన సేవింగ్ కమ్ ఇన్వెస్టిమెంట్ పథకం సుకన్య సమృద్ధి యోజ న పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎడ్యుకేషన్ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ అన్నారు. బెంజిసర్కిల్ సమీపంలోని ఓ హోటల్లో శుక్రవారం పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సుకన్య సమృద్ధి మహోత్సవ్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅ తిథిగా పాల్గొని ఖాతాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లలోపు బాలికల కోసం ఈ ఖాతాలను ఏర్పాటు చేశా రన్నారు. కనీస మొత్తం రూ.250 నుంచి జమచేయవచ్చనని తెలిపారు. పోస్ట్ మాస్టర్ జనరల్ సయ్యద్ రషీద్ మాట్లాడుతూ ఆజాదీకా అమృత్ ఉత్సవాల్లో భాగంగా దేశంలోని 75 నగరాలను సుకన్య ఖాతాలు తెరిచేందుకు ఎంపిక చేయగా, అందులో విజయవాడ కూడా ఉందన్నారు. ఈ నెల 1 నుంచి నిర్వహి స్తున్న ఉత్సవాల్లో భాగంగా 5 వేల ఖాతాలు తెరిచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ శాఖ సీనియర్ సూపరింటెండెంట్ ఎం. హరిప్రసాద్, కె. శివ వెంకటేశ్వరరావు, ఇతర పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …