విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
“సూత్ర ఎగ్జిబిషన్” బందర్ రోడ్ లో గల శేష సాయి కళ్యాణ మండపంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వాహకులు దేవంక్షు మాట్లాడుతూ ఈనెల 24, 25 తేదీలు కొనసాగుతుందని స్టాల్ నందు మంచి నాణ్యమైన జ్యువెలరీ నాణ్యమైన ఆభరణాలు డైమండ్స్ డిజైనర్ క్లాత్, హ్యాండ్ కార్స్ అన్ని రకాలు ఏర్పాటు చేశామని అన్ని రాష్ట్రాల నుండి గత 20 సంవత్సరాలుగా ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని 60 స్టాల్స్ ఉన్నాయని, అధునాతమైన అన్ని రకాలు ఏర్పాటు చేశామని అన్నారు. మా ఎగ్జిబిషన్ నందు ప్రతి ఒక్కరి స్థాయికి తగినట్టుగా అన్ని రకాలు గలవని ఈ అవకాశం ప్రతి ఒక్కరు వీక్షించి సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, స్టాల్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …