Breaking News

గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ అవగాహన పోస్టర్ ఆవిష్కరణ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
అక్టోబర్ 9వ తేదీన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే రన్ లో ప్రతీ ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 9వ తేదీన నిర్వహించే గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ అవగాహన పోస్టర్ ను ఆదివారం శాసనసభాపతి క్యాంపు కార్యాలయంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా శాసనసభాపతి మాట్లాడుతూ మహమ్మారి క్యాన్సర్ ను తొలి దశలోనే గుర్తించి చికిత్సతో నయం చేసేలా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ రాష్ట్రంలోనే కాకుండా దేశ అంతర్జాతీయ స్థాయిలో పలు కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ క్యాన్సర్ పై చేస్తున్న పోరాటాన్ని గుర్తించి ప్రభుత్వ సహకారంతో అనుసంధానించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొస్తామని అన్నారు. వైద్య ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని, గ్రామ స్థాయిలో వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా విలేజ్ హెల్త్ క్లినిక్ లు ఏర్పాటుచేసామన్నారు. అక్టోబర్ 9 వ తేదీన నగరంలోని బిఆర్ టియస్ రోడ్ లో గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ ను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అదే రోజున ప్రపంచవ్యాప్తంగా 130 కి పైగా దేశాల్లో 450 కి పైగా ప్రదేశాల్లో క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారని అన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా 2,500 మందికి పైగా క్యాన్సర్ స్క్రీనింగ్ పై ఉచిత కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. ఐదు లక్షలకు పైగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారన్నారు. 4,350 కి పైగా క్యాన్సర్ రోగులను గుర్తించి వారికి సూచనలు సలహాలు అవసరమైన మందులను ఫౌండేషన్ ద్వారా అందించారన్నారు. రాష్ట్రంలోనే కాక అమెరికా లోని ఏడు ప్రధాన నగరాల్లో సంస్థ కార్యకలాపాలు తెలుగువారిచే నిర్వహించబడుతున్నాయన్నారు. కోవిడ్ కష్టకాలంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ 20 లక్షల మాస్కులు, 500కి పైగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందించి సహకరించారన్నారు. ఈ ఫౌండేషన్ ఎప్పటి వరకు ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారన్నారు. 2020లో రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ ఫౌండేషన్ సొంతం చేసుకుందని శాసనసభ స్పీకర్ వివరించారు. అక్టోబర్ నెలలో ఆముదాలవలస నియోజకవర్గంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అక్టోబర్ 9వ తేదీన నిర్వహించే గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ లో యువత, క్రీడాకారులు, విద్యార్థులు,మహిళలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని రన్ ను విజయవంతం చేయాలని శాసనసభాపతి తమ్మినేని సీతారాం కోరారు.

ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ గత సంవత్సరం మన రాష్ట్రంలో నిర్వహించిన కార్యక్రమం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన ఘనత ఈ ఫౌండేషన్ కి ఉందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *