విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
సామాజిక సేవా దృక్పథంతో సమాజంలోని నిస్సహాయకులకు తోడ్పాటును అందించి సహకరించాలని గవర్నర్ విశ్వభూషన్ హరిచంద్‌న్ పిలుపునిచ్చారు. ఆదివారం పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ 107వ జన్మదినోత్సవం సందర్భంగా పండిట్ దీనదయాల్ శ్రవణ ఫౌండేషన్ వారి ఆధ్యర్యంలో వినికిడిని నష్టపోయిన బడుగు బలహీన వర్గాల వారికి ఉచిత వినికిడి యంత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక సిద్దార్థ కళాశాల అడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొని జ్వోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి వినికిడి యంత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఆనందకరమని పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ జీవితం భావితరాలకు ఎంతో ఆదర్శవంతమని పేర్కొన్నారు. ప్రతీ వ్యక్తి సామాజికి భాధ్యత కలిగి ఉండి వారి కర్తవ్య నిర్వహణలో భిన్నతంలో ఏకత్వంగా అందరూ కలిసి మెలిసి దేశాభివృద్ధికి తోడ్పాటు నందించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ సమగ్ర మానవత వాదం సంస్కృతి- జాతీయిత విలువల సిద్దాంతాన్ని ప్రతిపాదించిన వాడని సర్వోదయ వంటి గాందేయ సోషలిస్టు సిద్దాంతాలను బలంగా పాటించేవారిని అన్నారు. స్వదేశీ పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ సోషలిజం, పెట్టుబడిదారి విధానానికి భిన్నంగా మానవుడు కేంద్రంగా స్వదేశీ ఆర్థిక నమూనాను అభివృద్ధి చేయడం దేశానికి ఎంతో ముఖ్యమైనదని గవర్నర్ అన్నారు. దీనదయాల్ శ్రవణ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని మానవునికి అత్యంత విలువైన ఇంద్రియాలలో వినికిడి శక్తి ఒకటని వినికిడి లోపాన్ని చిన్నవయసులోనే గుర్తిస్తే చికిత్స చేయవచ్చునని అన్నారు. దేశంలో సుమారు 63 మిలియన్ ప్రజలు గణనీయమైన శ్రవణ బలహీనతతో బాధపడుతున్నారన్నారు. ఏపి, తెలంగాణ రాష్ట్రలలో దీనదయాల్ శ్రవణ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.
కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత ప్రచారక్ సిహెచ్ ఆదిత్య, ఎస్‌బిఐ డిజియం కె. రంగరాజన్, దీనదయాల్ శ్రవణ ఫౌండేషన్ చైర్మన్ రేగుల రామాంజనేయులు, గవర్నర్ స్పెషల్ సిఎస్ ఆర్‌పి సిసోడియా, మాజీ జడ్పి చైర్మన్, రామినేని ఫౌండేషన్ కన్వినర్ పి. నాగభూషణ్, హెచ్‌ఆర్ గ్రూప్స్ మేనేజింగ్ డైరెక్టర్ టి. హనుమంత్‌రావు, రామినేని ఫాండేషన్ చైర్మన్ రామినేని ధర్మ ప్రచారక్, ఆడియోలజిస్ట్ షెక్ ఆసీనా, యు బ్లెడ్ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
రైతులకు కలుగు ఉపయోగాల గురించి పరిశీలన…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “ఒక జిల్లా ఒకఉత్పత్తి” గుంటారు మిర్చి పైన ఢిల్లీ PMO ఆఫీసులో ODOP …