విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ది.26.09.2022వ తేదీ నుండి 05.10.2022వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేడుకలను పురష్కరించుకుని అనవాయితీగా వస్తున్న సాంప్రదాయం నేపథ్యంలో నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్., సతీ సమేతంగా ది.25.09.2022వ తేదీ సాయంత్రం అమ్మవారికి పసుపు, కుండుమ, పువ్వులు, పండ్లు మరియు పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా పోలీస్ కమీషనర్ దంపతులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో అనవాయితీ ప్రకారం రావి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అమ్మవారికి సారెను తీసుకుని దుర్గగుడికి వెళ్ళగా, దుర్గగుడి ఈ.ఓ. భ్రమరాంబ మరియు దుర్గగుడి అధికారులు నగర పోలీస్ కమీషనర్ దంపతులను సాదరంగా ఆహ్వానం పలికి వేద పండితుల నడుమ పూజలు జరిపి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డి.సి.పి. విశాల్ గున్ని ఐ.పి.ఎస్., సి. ఎస్. డబ్ల్యూ డి.సి.పి. ఉదయరాణి, పశ్చిమ ఇన్ ఛార్జ్ డి.సి.పి. కొల్లి శ్రీనివాస్, అడ్మిన్ ఇన్ ఛార్జ్ డి.సి.పి. పి.వెంకట రత్నం, ఎస్.బి. ఏ.డి.సి.పి. సి.హెచ్.లక్ష్మీపతి, ట్రాఫిక్ ఏ.డి.సి.పి. టి. సర్కార్, ఏ.సి.పి.లు, ఇనస్పెక్టర్లు, ఎస్.ఐలు మరియు పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో శుక్రవారం నారెడ్కో ప్రాపర్టీ షో ప్రారంభానికి హాజరైన రాష్ట్ర …