విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రిపై సోమవారం దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు బుధవారం ఉదయం శంఖానాథంతో ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, అమ్మవారు పెళ్లిరోజు స్వర్ణ కవచాలం కృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సోమవారం తెల్లవారుజాము నుంచి అమ్మవారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి 11 గంటల వరకు భక్తులకు కనకదుర్గమ్మ దర్శనం కల్పించారు. నవరాత్రి ఉత్సవాల తొలిరోజున ఇంద్రకీలాద్రిపై అధిక సంఖ్యలో మహిళలు మెట్ల పూజలు చేయడం కనిపించింది. కొందరు మోకాళ్లపై నడుచుకుంటూ అమ్మ సన్నిధికి చేరుకుని దుర్గమ్మపై తమకున్న భక్తిని చాటుకున్నారు. ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసరాలను విద్యుత్తు దీపకాంతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు గావించారు. రంగురంగుల విద్యుత్తు దీప కాంతుల నడుమ ఇంద్రకీలాద్రి కోటికాంతులతో ప్రజ్వరిల్లుతూ భక్తులకు నేత్రానందం కల్గిస్తుంది. ఉదయం3 గంటలకు సుప్రభాతసేవ 3.30కు స్నపనాభిషేకం, 7:30 కి ప్రాతఃకాల అర్చన అనంతరం బాలభోగ నివేదన తరువాత ఉదయం 9 గంటల నుండి స్వర్ణ కవచాలంకృత శ్రీ కనక దుర్గాదేవి గా భక్తులకు దర్శనం ఇవ్వనున్న అమ్మవారు మొదటి రోజు అమ్మవారికి బంగారపు రంగు చీర కట్టి, కట్టె పొంగలి, చలిమిడి, వడపప్పు,ని నైవేద్యంగా పెడతారు. అంతే కాకుండా అమ్మవారిని దర్శిచుకుంటే శత్రు బాధలు తొలుగుతాయని, జీవితం ఆనందం గా ఉంటుంది అని భక్తులు యొక్క నమ్మకం. మొదటి రోజే గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పండితులు, ఈఓ భ్రమరాంబ మరియు ఆలయ అధికారులు అంత కూడా గవర్నర్ కు ఘనం గా స్వాగతం పలికారు.
Tags indrakiladri
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …