విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్ర ప్రదేశ్ ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్ లో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్లెక్సీ నిషేధం నవంబర్ ఒకటో తేదీ నుండి అమలు చేయాలని జీవో ఇచ్చారని జీవోలో ఫ్లెక్సీలో పర్యావరణానికి హాని కలిగిస్తుందని జీవోలో పేర్కొన్నారని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం 100 మైక్రోన్స్ కన్నా ఎక్కువ వాడుకోవచ్చని మేము 200 మైక్రోన్స్ నుండి 500 మైక్రోన్స్ వరకు మెటీరియల్ వాడుతున్నామని అందువల్ల అత్యంత హానికారం లేదని ఈ జీవో వల్ల ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎక్కువమంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని,ఇండియాలో సింగిల్ ప్లాస్టిక్ వస్తువులు చాలా ఉన్నాయని అవేమీ హాని కానప్పుడు ఫ్లెక్సీ ఎందుకు హానికరం అవుతుంది అని అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన జీవో ప్రకారం పెనాల్టీ కూడా చాలా ఎక్కువగా వేశారని భరించలేనంతగ ఉందని, కనీస కాలపరిమితి కూడా లేకుండా చేశారని అన్నారు. ఉపాధ్యక్షులు సొలస సుధాకర్ మాట్లాడుతూ జీవోలో కాటన్ క్లాత్ పెయింటింగ్ చేసుకోవచ్చని ప్రస్తుతం కాటన్ చాలా కష్టమని మార్కెట్లో కాటన్ మెటీరియల్ అందుబాటులో లేదని అందుబాటులోకి వచ్చి వినియోగం లోకి రావాలంటే కనీసం రెండు సంవత్సరాలు సమయం పడుతుందని అంతేకాకుండా కాటన్ ప్రింటింగ్ చేయడానికి ప్రస్తుత మిషిన్లు సహకరించమని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోకు మేము వ్యతిరేకంగా లేమని మాకు కొంచెం వ్యవధిస్తే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకుంటామని ప్రభుత్వం పునర్ ఆలోచించాలని ఈ జీవో వల్ల మేము చాలా నష్టపోతామని అన్నారు. ఇచ్చిన మెటీరియల్ వల్ల గాని మిషన్ వల్ల గాని చాలా నష్టపోతామని ప్రభుత్వం కోరారు. ఈ జీవో వల్ల ఫ్లెక్సీ యజమానులు వర్కర్స్, 10 లక్షల కుటుంబాలు రోడ్డున పడతాయని ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుని మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ మహాదేవరాజు ట్రెజరర్ నాగబాబు ఫ్లెక్సీ ప్రింటింగ్ యాజమానులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …