విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జనరల్ బాడీ మీటింగ్ జరిగింది .స్థానిక హనుమాన్ పేట లో హోటల్ శ్రీపాద లోజరి గిన విలేకర్ల సమావేశంలో ముస్లిం ఐక్య వేదిక గౌరవ అధ్యక్షులు జియాపూర్ రెహమాన్ మాట్లాడుతూ ముస్లిం ఐక్యవేదికరాష్ట్ర కమిటీ ఏర్పాటు చేశామని రాష్ట్రంలో అన్ని కులాలు కలుపుకొని వారి సమస్యలకు పరిష్కారం చేస్తామని గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రతి నియోజకవర్గానికి 500 మంది చొప్పున మెంబర్షిప్ చేర్పించి లక్ష మంది సభ్యత్వాలు నమోదు చేస్తామని అన్ని కులాల వారికి ఏ సమస్యలు వచ్చినా అది ముస్లిం ఐక్యవేదిక సమస్యలు గాభావించి సమస్యలును పరిష్కారం చేస్తామని సభ్యత్వం ద్వారా వచ్చిన అమౌంట్ ను సంవత్సరానికి పేదలకు 2వేల వివాహలు జరిపిస్తామని అన్నారు. అనంతరం ముస్లిం వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జాఫర్ పులి మాట్లాడుతూ ముస్లిం ఐక్యవేదిక భావితరాల బంగారు భవిష్యత్తుకు పునాది అవుతుందని ఆయన అన్నారు. రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫారసులను ముస్లింలకు వెంటనే అమలు చేయాలని రాష్ట్రంలో ఉన్న ముస్లింలకు కేటాయించిన బిసి-ఇ క్యాటగిరి సెంట్రల్ ఓబీసీ లిస్టులో వెంటనే చేర్చాలని రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అబ్దుల్ కలాం ,ట్రెజరర్ సలావుద్దీన్, ఉపాధ్యక్షులు కాజా సలీం, జాయింట్ సెక్రెటరీ రుహాలా నూర్ ,రాష్ట్ర సలహాదారు డాక్టర్ షేక్ మస్తాన్ వలీ ముస్లిం ఐక్యవేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గత ప్రభుత్వానిది స్కాముల్లో రికార్డు… కూటమి ప్రభుత్వానిది స్కీమల్లో రికార్డు
-పాడి రైతులు న్యూజిలాండ్ తరహాలో ప్రగతి సాధించాలి -గత ప్రభుత్వంలో నాయకుల సొంత డెయిరీలను పెంచుకున్నారు -తిరుపతి దుర్ఘటన విషయంలో …