విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లో వంగల రామకృష్ణ సెంట్రల్ అసెంబ్లీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కన్వీనర్, ఆధ్వర్యంలో బి జె పి పలు సెంటర్ లో ప్రజా పోరు యాత్ర నీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మైనారిటీ మొర్చ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ ప్రజా పోరు యాత్ర లో మాట్లాడుతూ గత టిడిపి ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన పథకాలు మావి అని చెప్పి స్టికర్ లు వేసుకున్నారన్నారు. ఇప్పుడు ఈ వై సీ పీ ప్రభుత్వం కుడా మావి అని చెప్పి స్టికర్లు వేసుకున్నారన్నారు. ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వారి మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలను చేస్తున్న మోసాలను మానుకోవాలని హితవు పలికారు. మద్యం లో స్కాం , ఇసక లో స్కాం , రేషన్ లో స్కాం, పేదలకు ఇచే ఇళ్ళ మీద కూడా స్కాం …. చేస్తున్న వై యస్ జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. పలు పథకాల ద్వారా ఉచితంగా పంచిపెట్టి దానికి రెట్టింపు పన్నుల ద్వారా పిండుకుంటున్నరని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బొమ్మదేవర శ్రీనివాస్కో కన్వనర్,సెంట్రల్ అసెంబ్లీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ బొమ్మదేవర రత్న కుమారి జిల్లా మహిళా మార్చ అధ్యక్షురాలు, కొలకలేటి శ్రీనివాస్, శ్రీరామ్ చంద్ర మూర్తి, మండల ఓబీసీ ప్రెసిడెంట్ కొలను కృష్ణ, ఓబీసీ జోనల్ ఇంచార్జి, శ్రీలక్ష్మి, మాచవరం మండల అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …