మహానేత వైఎస్సార్ సంకల్పాన్ని నిజం చేస్తున్న సీఎం వైఎస్ జగన్

-రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-30 వ డివిజన్ 249 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు నిరుపేదల కుటుంబాలలో భరోసాని నింపాయని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 30 వ డివిజన్ 249 వ వార్డు సచివాలయ పరిధిలో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సోమవారం ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కె.ఎల్.రావు నగర్లో ప్రజాప్రతినిధులు, అధికారులు విస్తృతంగా పర్యటించి.. 350 గడపలను సందర్శించారు. ఈ సందర్భంగా మూడేళ్లలో ప్రభుత్వం చేసిన మంచితో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖను లబ్ధిదారులకు వివరించారు. ప్రజలకు అందించిన సంక్షేమంతో పాటు వాడవాడలా జరిగిన అభివృద్ధి గూర్చి గడప గడపకు వెళ్లి ధైర్యంగా చెప్పగలిగిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమై ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు. కానీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల కాలంలో 99శాతం హామీలు అమలు చేసినట్లు పేర్కొన్నారు. ఒక రాష్ట్రంలో రూ. లక్ష కోట్ల రూపాయలతో 31 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం దేశ చరిత్రలోనే ఒక రికార్డని.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే అది సాధ్యపడిందన్నారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి అర్జీలు, సూచనలు స్వీకరించారు. అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయవలసిందిగా వీఎంసీ సిబ్బందికి సూచించారు.

అంగన్వాడీ కేంద్రం సందర్శన
అంగన్వాడీ కేంద్రాల బలోపేతంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. పర్యటనలో భాగంగా స్థానిక అంగన్వాడీ కేంద్రాలను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అందించే పౌష్టికాహారంపై ఆరా తీశారు. చిన్నారులకు పప్పు ధాన్యాలు ఆకుకూరలతో కూడిన పోషక విలువలు అధికంగా ఉండే ఆహారాన్ని అందించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాలను జగనన్న ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఈ పోషకాహారంతో చక్కని ఆరోగ్యంతో పాటు గర్భిణీలు, బాలింతలలో రక్తహీనత నివారించవచ్చన్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య సూత్రాలను తెలియపరిచేవిధంగా సూపర్ వైజర్లు సలహాలు, సూచనలు అందించాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో ప్రతిపక్షాల పని అయిపోయింది
ఓవైపు రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు మాత్రం ఎల్లో మీడియాపై ఆధారపడి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు విమర్శించారు. ముఖ్యంగా కులాలు, మతాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఏ చిన్న సంఘటన జరిగినా.. ప్రభుత్వంపై నెట్టడం తెలుగుదేశం నేతలకు పరిపాటిగా మారిందన్నారు. కేవలం కుల, మత రాజకీయాలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలు పని చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదిస్తేనే వైఎస్సార్ సీపీకి 151 సీట్లు వచ్చాయని.. అటువంటి పార్టీపై కులముద్ర వేయడం అవివేకమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఏకమై వచ్చినా.. వైఎస్సార్ సీపీకి సాటి రావనే విషయాన్ని గ్రహించాలన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల పని అయిపోయిందని.. తెలుగుదేశం పార్టీకి ఇవే ఆఖరి ఎన్నికలని తెలిపారు. అనంతరం రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న దివ్యాంగుడు సూరిబాబును మల్లాది విష్ణు పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని వైద్య ఆరోగ్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి, డీఈ గురునాథం, రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు డి.దుర్గారావు, సాసుపల్లి రామకృష్ణ, మార్తి చంద్రమౌళి, సామంతకూరి దుర్గారావు, ముత్యాలు, ప్రసాద్, ముద్రబోయిన దుర్గారావు, పవన్ రెడ్డి, పెద్దిరాజు, భోగాది మురళి, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *