-24 గంటలు పారిశుధ్య సిబ్బంది అందుబాటులో ఉంచాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో అధికారులతో కలసి సోమవారం ఉదయం (శనీశ్వర స్వామి ఆలయం) దగ్గర పారిశుధ్య కార్మికుల యొక్క విధులను పర్యవేక్షించి వారి యొక్క మస్తరు విధానము పరిశీలించారు. దసరా ఉత్సవాలకు సంబందించి పారిశుధ్య పనులు నిర్వహించు 3 షిఫ్ట్ లలో 24 గంటలు అందుబాటులో ఉంచాలని, మరుగుదొడ్లు మరియు ఆలయ పరిసర ప్రాంతాలు, రోడ్లు, క్యూ లైన్ లు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. సిబ్బంది కి సకాలంలో భోజన ప్యాకెట్ లు అందుతున్నద లేనిది సిబ్బందిని అడిగితెలుసుకొన్నారు. అదే విధంగా మంచి పాయింట్ లను పరిశీలించి నిరంతరం ప్రజలకు త్రాగు నీరు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. దసరా ఉత్సవాలకు సంబంధించి రేపటి నుండి అధిక మొత్తంలో భక్తులు వచ్చుటకు అవకాశం ఉన్నందున అధికారులకు దిశనిర్దేశాలు ఇస్తూ, .అధికారులు అందరు వారికీ కేటాయించిన ప్రదేశాలలో నిరంతర పర్యవేక్షణలో సిబ్బందిని అప్రమత్తం చేస్తూ, భక్తులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని అన్నారు. విధినిర్వహణలో ప్రతి ఒక్కరు విధిగా నిభందనలు పాటించేలా చూడాలని అన్నారు. పశ్చిమ నియోజక వర్గం పరిధిలోని 42వ డివిజన్ లో హౌసింగ్ బోర్డ్ కాలనీ మొదలగు ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో కమిషనర్ పర్యటిస్తూ, ప్రధాన మరియు అంతర్గత రోడ్ల యందలి పారిశుధ్య నిర్వహణ విధానము మరియు సైడ్ డ్రెయిన్స్ నందలి మురుగునీటి పారుదల విధానము పర్యవేక్షించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ మెయిన్ B.T రోడ్స్ వర్క్స్ ను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. తదుపరి భవానిపురం 39 వ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ తో కలిసి కమ్యూనిటి హాలును పరిశీలించి మిగిలిన పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పర్యటనలో స్థానిక కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ, ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి, మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.