-నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలో ‘ స్వచ్ఛ్ సర్వేక్షణ్’ పోగ్రామ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
స్వచ్చ్ అమృత్ మహోత్సవ్ కార్యక్రమములో భాగంగా సోమవారం ఉదయం 3 వ డివిజన్ వివేకానంద రోడ్డు నందు కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, తూర్పు నియోజక వర్గ ఇన్ ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, మరియు కార్పొరేటర్లు అందరితో మరియు స్కూల్ విద్యార్ధులతో కలిసి స్వచ్ఛ్ సర్వేక్షణ్’ ర్యాలి ను ప్రారంభించినారు. స్వచ్చ్ అమృత్ మహోత్సవ్ కార్యక్రమములో భాగంగా స్వచ్ఛ్ సర్వేక్షణ్’ కార్యక్రమమును నగరపాలక సంస్థ అద్వర్యంలో నిర్వహించిన పారిశుద్ద్య పరిశుభ్రతలో భాగంగా రోడ్లను చీపుర్ల తో ఉడ్చి, తరువాత మొక్కలను నాటడం, వాల్ పెయింటింగ్, పోగ్రామ్ లో కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, తూర్పు నియోజక వర్గ ఇన్ ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ శ్రీమతి బెల్లం దుర్గ, స్థానిక కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవలిక మరియు స్కూల్ విద్యార్ధులతో కలిసి పాల్గొన్నారు. ఈ పోగ్రామ్ లో పాల్కొన్న స్కూల్ విద్యార్ధులకు మరియు ఈ కార్యకమములో పాల్గొన్న వారికి వి.ఎం.సి. కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వారి తరుపున స్వచ్ఛ్ సర్వేక్షణ్’ కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగర ప్రజలకు 18,000 వేల చేతి గుడ్డ సంచులు అందజేసారు.
అదే విధంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్. మాట్లాడుతూ విజయవాడ నగరం జాతీయ స్థాయిలో స్వచ్చ్ సర్వేక్షణ్ నందు 3వ స్థానంలో ఉన్నాం, అందరికి తెలిసిన విషయం మన ఆ స్థానాన్ని నిలపెట్టుకోవలననిన లేదా మొదటి లేదా రెండోవ స్థానం కైవసం చేసుకోవాలన ప్రతి ఒక్కరం భాద్యతగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం నిషేదించి వాటికీ బదులుగా జ్యూట్, క్లాత్ వంటి సంచుల వాడకం మరియు మన ఇంటి, నగర పరిసరాలు అన్నియు పరిశుభ్రంగా ఉంచుకోవటం వంటి అంశాలను విధిగా పాటించి నగరంలో పర్యావరణాన్ని కాపాడుటలో ప్రతి ఒక్కరు పూర్తి భాద్యత చేపట్టాలని అన్నారు. దీని ద్వారా ప్రజలలో కూడా చైత్యనం వస్తుందని పేర్కొన్నారు. యువకులు చాలా ఉత్సాహంగా మరియు ఆసక్తిగా వచ్చి పాల్గొనాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సింగల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్త్పతులను నిషేధించాలని అన్నారు. ముందుగా మనం పాటిస్తూ, ప్రజలకు అవగాహన కల్పించాలనే ప్రధాన ఉద్దేశ్యంతో నేడు ఈ కార్యక్రమము చేపట్టినట్లు అన్నారు.
తూర్పు నియోజక వర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ భారతదేశంలోనే నగర పచ్చదనం, పరిశుభ్రత వంటి బృహత్తర కార్యక్రమలపై అవగాహనా కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. స్వచ్ఛ్ సర్వేక్షణ్’ లో భాగంగా అధికారులు, సిబ్బంది కృషి, యువత మరియు నగర ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. స్వచ్ఛ్ సర్వేక్షణ్’ లో ఒకటిగా విజయవాడ నగరం నిలిచిందని, నగర ప్రజల సహాయ సహకారాలతోనే ఇది సాధ్యమైందని అన్నారు.
కార్యక్రమములో స్థానిక కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవలిక ,వెటర్నరి అసిస్టెంట్ సర్జిన్ డా. ఏ.రవిచంద్, హెల్త్ ఆఫీసర్ డా.శ్రీదేవి, ఏ.డి.హెచ్ శ్రీనివాసు, బయాలజీస్ట్ డా.బాబు శ్రీనివాసన్, మరియు ఇతర అధికారులు మరియు కార్పొరేటర్లు, విద్యార్ధులు పాల్గొన్నారు.