-డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త:
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునే వృద్ధులు, దివ్యాంగులకు రేపటి మంగళవారం నుండి అక్టోబర్ ఐదు మూలా నక్షత్రం రోజు మినహా మిగిలిన రోజులలో ఉదయం 10:00 గంటలు నుంచి 12:00 గంటలు వరకు, సాయంత్రం 4:00 గంటల నుంచి 6:00 గంటల వరకు నగరంలోని మోడల్ గెస్ట్ హౌస్ నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.వీరిని బస్సులలో అమ్మవారి దర్శనం చేయించి మళ్ళీ వారిని అక్కడికి తీసుకు రావడం జరుగుతుందన్నారు. వృద్ధులు ,విభిన్న ప్రతిభావంతులు ఎటువంటి టికెట్స్ కొనవలసిన అవసరం లేదని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు.