-వారోత్సవాలలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
మహిళలు సంతోషంగా ఉంటేనే కుటుంబాలు, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. సత్యనారాయణపురంలోని గాయత్రీకళ్యాణ మండపం నందు నాలుగో రోజు జరిగిన వైఎస్సార్ చేయూత వారోత్సవాలలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజా రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా చేయూత పథకం ప్రాధాన్యతను వివరిస్తూ డప్పు కళాకారులచే ప్రదర్శించబడిన నాటకం ఆకట్టుకుంది. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. జనరంజకమైన పాలనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనతికాలంలోనే ప్రజలందరి గుండెల్లో సమున్నత స్థానాన్ని సొంతం చేసుకున్నారని తెలిపారు. మరీముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఆయన అందించిన సహాయ సహకారాలు మహిళలు ఎన్నటికీ మరువలేరన్నారు. ఆడపడుచులు ఆర్థికంగా ఎదిగి లక్షాధికారులు కావాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగా వైఎస్సార్ చేయూత పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 45 నుంచి 60 సంవత్సరాలలోపు మహిళలకు వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ. 18,750 అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్ కే దక్కుతుందని మల్లాది విష్ణు అన్నారు. మూడో విడత చేయూత ద్వారా సెంట్రల్ నియోజకవర్గంలో 10,875 మందికి 20 కోట్ల 39 లక్షల 6 వేల 250 రూపాయల లబ్ధి చేకూర్చినట్లు తెలియజేశారు. అలాగే 32వ డివిజన్ లో 345 మందికి రూ. 64.68 లక్షలు., 33వ డివిజన్లో 88 మందికి రూ. 16.50 లక్షలు., 36 వ డివిజన్లో 305 మందికి రూ. 57.18 లక్షలు.. మొత్తంగా 738 మందికి రూ. 1.38 కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాలలో జమ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సాయంతో కూరగాయలు, పచ్చళ్లు, చీరలు, బొమ్మలు వంటి వ్యాపారాలు ప్రారంభించినట్లు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మహిళలు వివరిస్తుండటం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని మల్లాది విష్ణు అన్నారు.
ఆడపడుచులకు రూ.233.26 కోట్ల సంక్షేమం
దేశంలోనే సంక్షేమ కార్యక్రమాలను శాచ్యురేషన్ విధానంలో గడప గడపకు చేరవేస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. మహిళా సంక్షేమం కోసం ప్రత్యేకంగా 7 పథకాలను ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేస్తున్నామన్నారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 32,510 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 56 కోట్ల 34 లక్షలు., సున్నావడ్డీ పథకం ద్వారా 42,760 మందికి రూ. 10 కోట్ల 71 లక్షలు., వైఎస్సార్ చేయూత ద్వారా 10,875 మందికి రూ. 43 కోట్ల 38 లక్షలు., అమ్మఒడి పథకం ద్వారా 28,834 మంది తల్లులకు రూ. 84 కోట్ల 45 లక్షలు., వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 1,956 మందికి రూ. 8 కోట్ల 53 లక్షలు., ఈబీసీ నేస్తం ద్వారా 1,947 మందికి రూ. 2 కోట్ల 92 లక్షలు నేరుగా ఆడపడుచుల ఖాతాలలో జమ చేసినట్లు వివరించారు. మొత్తంగా మూడేళ్లలో 1,25,785 మంది లబ్ధిదారులకు రూ. 233.26 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని రోజువారీ అవసరాలకు వినియోగించకుండా.. పెట్టుబడి సాయంగా వ్యాపారాలను ప్రారంభించాలని సూచించారు. తద్వారా తమ కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసుకోవాలని తెలిపారు. వ్యాపారాలు చేసుకోవడానికి ముందుకు వచ్చే వారికి బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించడం జరుగుతుందని మల్లాది విష్ణు తెలియజేశారు.
ఎం.జ్యోతి, లబ్ధిదారు మాట్లాడుతూ.. చేయూత సాయం ద్వారా రూ. 18,750 చొప్పున ఇదివరకు రెండు సార్లు లబ్ధి పొందినట్లు తెలిపారు. మొదటి సారి ఆ డబ్బులతో కూరగాయల వ్యాపారం మొదలుపెట్టినట్లు వెల్లడించారు. దీంతో పాటు రెండోసారి వచ్చిన సాయంతో పాలవ్యాపారం ప్రారంభించడంతో నెలకు రూ. 10 వేలకు పైనే ఆదాయం వస్తున్నట్లు వివరించారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్న జగనన్నకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ (ఇంఛార్జి) అంబేద్కర్, సిడిఓ జగదీశ్వరి, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు శర్వాణీ మూర్తి, బాలిగోవింద్, కొంగితల లక్ష్మీపతి, కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాషిణి, నాయకులు గుండె సుందర్ పాల్, పిల్లి కృష్ణవేణి, పార్టీ శ్రేణులు, లబ్ధిదారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.