విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చెప్పిన మాట ప్రకారం మెనిఫెస్టోలో పొందుపరిచిన 95శాతం హామీలను కేవలం మూడేళ్ళ కాలంలోనే నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం పటమట కనకమేడల రవీంద్ర కమ్యూనిటీ హాల్ నందు జరిగిన 4,10,11 డివిజన్లకు చెందిన 625 మంది లబ్ధిదారులకు మంజూరు అయిన 1,15,62,500 రూపాయలను అక్కాచెల్లెమ్మల ఖాతాలలో జమ చేయడం జరిగింది వైయస్సార్ చేయూత నిధుల విడుదల కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు మంజూరు అయిన దాదాపు రూపాయలను వారి ఖాతాలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు ఆర్థిక భరోసా కల్పించి వారి కాళ్ళ మీద వారు నిలబడాలని ఈ వైయస్సార్ చేయూత పధకం వరుసగా మూడో ఏడాది నిధులు విడుదల చేయడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి జగనన్న ప్రతి సంక్షేమ పథకంలో మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా పక్షపాతి గా నిలుస్తున్నారు అని కొనియాడారు. ఒక పక్క మహిళలకు మేలు జరిగేలా సంక్షేమ పథకాలు, మరోపక్క వారి రక్షణ కొరకు దిశ చట్టం, దిశా పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేసి పాలన అందిస్తుంటే,ప్రతిపక్ష తెలుగుదేశం వారి రాజకీయ మనుగడ కోసం అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. వారు గాని పద్దతి మార్చుకోపోతే మహిళలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,వైస్సార్సీపీ ఇంచార్జిలు గల్లా రవి,నిడదవోలు ఉదయ్,పర్వతనేని పవన్, మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …