విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన భవన్లో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర డీలర్ల సంక్షేమ సమాఖ్య సమావేశం జరిగింది. వైసీపీ ప్రభుత్వం ఎండీయూ వ్యాన్ల వల్ల రేషన్ డీలర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని.. జాతీయ ఉత్పత్తి, పంపిణీ పథకం డీలర్ల సంక్షేమ సమాఖ్య రాష్ట్రశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. జాతీయ ఆహార భద్రత చట్టానికి, ప్రజాపంపిణీ వ్యవస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఎండీయూ వ్యవస్థను రద్దుచేసి.. పాత విధానంలోనే రేషన్ పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సానుకూలంగా స్పందిం చి న్యాయం చేయకపోతే పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించింది. ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ కార్యక్రమంలో సమావేశానికి అధ్యక్షత వహించిన డీలర్ల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలామాధవరావుతో పాటు బీజేపీ ఎంపీ మాధవ్, మరో బీజేపీ నేత, డీలర్ల సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …