విజయవాడ అభివృద్ధి టిడిపి వల్లే సాధ్యమవుతుంది… : ఎంపీ కేశినేని నాని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ అభివృద్ధి అంటే అది టిడిపి వల్లే సాధ్యమవుతుందని ఎంపీ కేశినేని శ్రీనివాసరావు (నాని) అన్నారు. బుధవారం పశ్చిమ నియోజకవర్గం, జండా చెట్టు సెంటర్, వన్ టౌన్ నందు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నూతన కార్యాలయం ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జనాబ్ జలీల్ ఖాన్ తో కలిసి ఎంపీ కేశినేని శ్రీనివాసరావు (నాని) పాల్గొని నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేశినేని శ్రీనివాస్ (నాని) మాట్లాడుతూ గత యేడాది నుంచి ఇక్కడ ప్రజాస్వామ్య బద్దంగా టిడిపి పని చేస్తుందన్నారు.ఎవరు పదవులు పొందినా ఐక్యం గా నిర్ణయం జరిగిందన్నారు. 40యేళ్ల టిడిపి చరిత్ర లో ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం ఏర్పాటు చేశారన్నారు. రాజు సోలంకి సొంత స్థలాన్ని పార్టీ ఆఫీస్ కి విరాళంగా ఇచ్చారన్నారు. ఈ కార్యాలయం మొత్తం కూడా సొంత ఖర్చుతో నిర్మించిన రాజుకి ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటేనే కుల,‌ మతాలకు అతీతమన్నారు. ఇక్కడ అన్ని వర్గాల వారు ఉన్నారని అందరూ కలిసిమెలిసి ఉంటడం‌ గొప్ప విషయమన్నారు. ఇక్కడ ఉన్న రాజకీయ పరిణితి కూడా ఆశ్చర్యం కలిగిస్తుందని, పార్టీ నే కాదు. వ్యక్తి ని‌ చూసి ఓటు వేస్తారన్నారు.2019ఎన్నికలలో ఎంపిగా తనకు మెజారిటీ ఇచ్చారన్నారు.జగన్ చెప్పే అబద్దాలు, మోసాలను విని ప్రజలు‌ విస్తుబోతున్నారన్నారు.
జగన్ వచ్చాక విజయవాడ కు కృష్ణానది, దుర్గ గుడి, భవానీ ద్వీపం వచ్చాయని ప్రగల్బాలు పలుకుతున్నారని, జగన్ లేకపోతే విజయవాడే లేదన్నట్లుగా జగన్ గొప్పలు ఉన్నాయన్నారు.టిడిపి హయాంలోనే మూడు ఫ్లైఓవర్లు వచ్చాయని, పశ్చిమ నియోజకవర్గం లో పాతబస్తీ ని కొత్తగా అభివృద్ధి చేశామన్నారు.జగన్ వచ్చాకే ఈ‌ ప్రాంతం మొత్తం నాశనం చేశారని రాజధానిని చంపేసి రైతులను రోడ్డు మీదకు లాగేశాడని ఆరోపించారు.
రెండు వేల కోట్లు తెచ్చి అభివృద్ధి చేయలేని, చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవాచేశారు. మూడు రాజధానుల పేరుతో ముఖ్యమంత్రి ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని రాష్ట్రం మధ్యన ఉన్న అమరావతి రాజధాని ఉంటేనే అందరికీ ఉపయోగమన్నారు. విశాఖ అభివృద్ధి కి మేము వ్యతిరేకం కాదని, పారిశ్రామిక వాడ గా ఉన్న నగరాన్ని ముఖ్యమంత్రి అభివృద్ధి చేసేది ఏముందని అన్నారు. విశాఖ రైల్వే జోన్ రాకపోయినా జగన్ లో చలనం లేదని, కేంద్రం మెడలు‌ వంచడం కాదని, మోడీ కాళ్ల మీద పడుతున్నాడన్నారు. రాష్ట్రం లో అన్ని వర్గాల‌ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పన్నులు, ధరలు పెంచేసి సామాన్య ‌ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేశాడని ఆరోపించారు. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజా వేదికను కూల్చి జగన్ విధ్వంసకర పాలనను ప్రారంభించాడని, ఎన్టీఆర్‌ అంటే పేద ప్రజల ఆరాధ్య దైవమన్నారు. పార్టీ లకు అతీతంగా అందరూ అభిమానిస్తారని, హెల్త్ యూనివర్శిటీ కి ఎన్టీఆర్‌ పేరు తొలగించి వివాదం‌ చేశారన్నారు.ఇళ్లల్లో ఆడవాళ్లను అన్యాయం గా లాగుతున్నారని దూషిస్తున్నారని ఆరోపించారు. అందరినీ భాగస్వామ్యం చేసి టీం టిడిపి పేరుతో కార్యక్రమాలు‌ చేస్తామని, పార్టీ కోసం నిస్వార్థంగా పని చేసే వారికి ప్రధాన్యత ఉంటుందన్నారు. కమర్షియల్ నాయకులను అంగీకరించే ప్రసక్తే లేదని, ఎక్కడో తొడలు కొట్టినంత మాత్రాన నాయకులు కాలేరన్నారు. మీడియా నుంచి కాదు.. ప్రజల్లో నుంచే నాయకులు బయటకి వస్తారని అన్నారు. జగన్ పాలనలో పాట్లు పడుతున్న ప్రజలు పరిస్థితి ని అందరికీ వివరించడన్నారు.ఈ రాష్ట్రం బాగుండాలంటే టిడిపి అధికారం‌ చేపట్టాలని, చంద్రబాబు సిఎం కావాలనే సంకల్పం తో కలిసి మెలిసి పనిచేయాలన్నారు. యధా రాజా తధా ప్రజ అన్నట్లుగా వైసిపి నాయకులు ఉన్నారని, వారు ఎన్ని మాయలు చేసినా ఈసారి ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, జగన్ మాయ మాటలను, మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లండని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *