ఏర్పాట్లు బాగున్నాయి..అరగంటలోనే అమ్మవారి దర్శనం..

-దర్శనానంతరం సంతృప్తితో ఆనందం వ్యక్తం చేస్తున్న భక్తులు..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడవ రోజున గాయత్రీ దేవి అవతారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ అమ్మవారిని వేలాది మంది భక్తులు క్యూలైన్ల ద్వారా ప్రశాంతంగా దర్శనం చేసుకుని ఏర్పాట్ల పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధానాన్ని బుధవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించి భక్తుల అనుభూతిని అడిగి తెలుసుకున్నారు. తొలుత ఘాట్‌ రోడ్డు ప్రారంభంలోని రాజగోపురం వద్ద అన్‌లైన్‌లో టిక్కెట్ల అమ్మకాలను పరిశీలించి అనంతరం ఓంటర్నింగ్‌ వద్ద ఏర్పాటు చేసిన విఐపి టిక్కెట్‌ కౌంటర్‌లో కొనుగోలు చేసిన వారు క్యూలైన్‌లో చేరుకునే విధానాన్ని పరిశీలించి ప్రస్తుతం ఉన్న కౌంటర్‌ను ముందుకు తీసుకువచ్చి భక్తులకు అందుబాటులో టిక్కెట్‌ కొనుగోలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. అన్‌లైన్‌ విధానంతో పాటు ఆఫ్‌లైన్‌ విధానంలోను టిక్కెట్‌ అమ్మకాలను నిర్వహించాలన్నారు. ఉభయదాతలు పూజలు నిర్వహించుకున్న అనంతరం నేరుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్‌ మార్గంలో అమ్మవారి దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతరాలయ ప్రాగంణంతో భక్తులు రద్దీ లేకుండా దర్శనం చేసుకున్న భక్తులను వెంటనే శివాలయం మార్గం ద్వారా దిగువకు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు మీడియా సెంటర్‌ నుండి పాత్రికేయులతో మాట్లాడుతూ మొదటి రోజు గుర్తించిన లోటుపాట్లను సవరించడంతో భక్తులు ఉచిత దర్శనం చేసుకునే భక్తులు కూడా సుమారు గంటలోపే అమ్మవారి దర్శనం చేసుకోగలుగుతున్నారన్నారు. గత మూడు రోజులుగా అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, జ్యూడిషియల్‌ అధికారులు కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు ముందుగానే సమాచారం ఇస్తున్నారన్నారు. వారు స్వల్ప సమయంలోనే అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారన్నారు. అమ్మవారిని దర్శంచుకుంటున్న సామాన్య భక్తుల నుండి వారి అనుభవాలను తెలుసుకోవడం జరిగిందని గతం కంటే ఈ ఏడాది ఏర్పాట్లు బాగున్నాయని అమ్మవారి దర్శనం కూడా సంతృప్తిగా చేసుకుంటున్నామని వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. దివ్యాంగులకు మరింత సౌకర్యాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో పున్నమి ఘాట్‌ నుండి మరొక ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశామన్నారు. అమ్మవారిని దర్శంచుకుని ఘాట్‌ రోడ్డులో దిగువకు వచ్చే భక్తులు ఓంటర్నింగ్‌ వద్ద వాహనాల కోసం వేచిఉండటం వలన ఏర్పడుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసి ఓం టర్నింగ్‌ వద్ద నుండి భక్తులను తీసుకువెళ్ళెలా చర్యలు తీసుకున్నామన్నారు. క్యూలైన్లలో ఎప్పటికప్పుడు పారిశుద్ద్య చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. డ్యూటీ పాస్‌ ఉన్న వారు వారికి కేటాయించిన ప్రాంతానికి చేరుకుని విధులు నిర్వర్తించుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు పెట్టవద్దని కలెక్టర్‌ డిల్లీరావు పోలీస్‌ అధికారులు, సిబ్బందికి సూచించామన్నారు. అర్చకులకు పోలీసులకు మధ్య జరిగిన వివాధం స్వల్పమైనదని వారి ఇరువురితో మాట్లాడి సమస్యను పరిష్కరించడంతో వివాధం ముగిసిందన్నారు. ఎమైన లోటుపాట్టు ఉంటే వాటిని సరిదిద్ది సమన్వయంతో పనిచేసి విజయవంతంగా దసరా మహోత్సవాలను నిర్వహించి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *